హెచ్ఐవీకి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతికత పరిజ్ఞానంతో హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.
HIV: హెచ్ఐవీ వల్ల ఇప్పటికీ గణనీయంగా రోగులు మరణిస్తున్నారు. నియంత్రణ తప్పితే నయం లేని ఈ మహమ్మారికి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. CRISPR అనే టెక్నాలజీతో హెచ్ఐవీకి చికిత్స చేసే మార్గాన్ని కనుగొననారు.
ఆమ్‌స్టర్ డ్యామ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం హెచ్ఐవీని నయం చేయడానికి అనేక విధాల పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వారు సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొని సంచలన విజయాన్ని సాధించారు. ఈ టెక్నాలజీనే మాలిక్యులర్ కటింగ్ అని కూడా పిలుస్తారు. హెచ్ఐవీ వైరస్ సోకిన కణాల డీఎన్ఏను ఈ టెక్నాలజీ ద్వారా తొలగిస్తారు.
undefined
అయితే, ఇది ఇప్పటికిప్పుడే తక్షణ ఫలితాలను ఇస్తుందని చెప్పలేమని, హెచ్ఐవీకి విరుగుడు కనిపెట్టడంలో ఇది ఆరంభంగా పరిగణించాలని ఆమ్‌స్టర్ డ్యాం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోగి ఎంత సురక్షితంగా ఉంటున్నాడు? ఈ చికిత్స ఎంత సమర్థంగా, ప్రభావవంతంగా పని చేస్తున్నదని తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
హెచ్ఐవీకి సీఆర్ఐఎస్పీఆర్ చికిత్స ఎంత వరకు సమర్థవంతంగా, ప్రభావవంతంగా ఉన్నదో రివ్యూ చేసుకోవడం చాలా ముఖ్యమని నాటింగ్ హాం యూనివర్సిటీ, స్టెమ్ సెల్-జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డిక్సన్ అన్నారు. ఇది అద్భుతమైన ముందడుగే అయినప్పటికీ దీనిపై అధ్యయనం అవసరం అని వివరించారు.