ఆకాశం నుంచి ఉల్కపాతం.. రాత్రికి రాత్రే.. కోటీశ్వరుడయ్యాడు..!

By telugu news teamFirst Published Nov 19, 2020, 3:22 PM IST
Highlights

ఆ రాయి చాలా వేడిగా అనిపించింది. చాలా సేపటి తర్వాత అది ఓ స్పేస్ రాయిగా అతనికి అర్థమయ్యింది. దాని ధర ఇప్పుడు రూ.13కోట్లు పలుకుతోంది. దీంతో.. తన జీవితం మొత్తం మారిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.


కొంతమంది జీవితాంతం కష్టపడినా..  ఎక్కువగా సంపాదించుకోలేరు. కానీ.. కొందరు మాత్రం అదృష్టంతో కోట్లు సంపాదించేసుకుంటారు. తాజాగా.. ఓ వ్యక్తికి అలాంటి అదృష్టమే తలుపుతట్టింది. ఉల్కపాతం వల్ల ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 జోసువా హుటగలుంగ్‌ అనే వ్యక్తి ఇండోనేషియా ఉత్తర సుమిత్రాలోని కోలాంగ్‌లో నివాసం ఉంటున్నాడు. శవపేటికలు తయారు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో  కొద్ది రోజుల క్రితం ఇంట్లో శవపేటిక తయారు చేస్తుండగా ఇంటి పై కప్పు మీద ఏదో పడినట్లు శబ్దం వినిపించింది.

ఏంటా ఆ శబ్దం అని చూస్తే.. ఓ రాయి కనిపించింది. ఆ రాయి చాలా వేడిగా అనిపించింది. చాలా సేపటి తర్వాత అది ఓ స్పేస్ రాయిగా అతనికి అర్థమయ్యింది. దాని ధర ఇప్పుడు రూ.13కోట్లు పలుకుతోంది. దీంతో.. తన జీవితం మొత్తం మారిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

కాగా.. దీనిపై శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈ ఉల్క క్వాలిటీ, పరిమాణాన్ని బట్టి దాని ధర నిర్ణయించబడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక స్వచ్ఛతని బట్టి దీని విలువ గ్రాముకు 0.50-50 అమెరికన్‌ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ అరుదైన లోహాలకు గరిష్టంగా గ్రాముకు 1000 డాలర్లు కూడా చెల్లిస్తారని తెలిపారు.

ఇక జోసువాకు దొరికిన స్పేస్‌ రాక్‌ 4.5 బిలయన్‌ సంవత్సరాల క్రితం నాటిదని.. ఇది సీఎం1/2 కార్బోనేషియస్ కొండ్రైట్‌ వర్గానికి చెందిన అరుదైన స్పేస్‌ రాక్‌ అని తేలింది. ఇక దీని ధర గ్రాముకు 857 అమెరిన్‌ డాలర్లు పలుకుతుందని.. మొత్తం చూస్తే.. 1.85 అమెరికన్‌ డాలర్లు (మన కరెన్సీలో సుమారు 137437517.50 రూపాయల)విలువ చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. 

click me!