పాకిస్తాన్‌కు యూఏఈ ఊహించని షాక్

By Siva KodatiFirst Published Nov 19, 2020, 2:57 PM IST
Highlights

తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో కూరుకుపోవడంతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఆగ్రహానికి గురైన పాకిస్తాన్‌కు యూఏఈ షాకిచ్చింది. పాక్‌ నుంచి వస్తున్న సందర్శకులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది

తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో కూరుకుపోవడంతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఆగ్రహానికి గురైన పాకిస్తాన్‌కు యూఏఈ షాకిచ్చింది. పాక్‌ నుంచి వస్తున్న సందర్శకులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది.

పాక్‌తో పాటు మరో 11 దేశాల వీసాలను సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నట్లు తెలిపింది.

ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విదేశీయులు యూఏఈకి ప్రయాణాలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో వారి వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆ దేశ వైద్య అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

వైద్యులు వినతిని పరిశీలించిన ప్రభుత్వం.. పాకిస్తాన్‌ సహా 11 దేశాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని పలు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

ప్రాన్స్‌తో పాటు, బ్రిటన్‌ ఇప్పటికే రెండో విడత లాక్‌డౌన్‌ విధించాయి. మరొకొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు యూఏఈలో లక్షన్నర మందికి కరోనా సోకగా.. 542 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 

click me!