
లండన్ : ఓ వ్యక్తి అనుకోని పరిస్థితిలో 26 ఏళ్ల క్రితం తన వీర్యాన్ని దానం చేశాడు. తర్వాత క్యాన్సర్ చికిత్స కారణంగా తండ్రి అయ్యే అవకాశం లేకుండా పోయింది. పిల్లలు లేరనే లోటు ఆ దంపతులకు ఇప్పటికీ ఉండిపోయింది. అయితే గతంలో తాను వీర్యదానం చేసిన విషయం గుర్తుకు వచ్చింది. దీంతో ఎట్టకేలకు నలభై ఏడేళ్ల వయసులో ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
లండన్కు చెందిన పీటర్ హికిల్స్ ఫుట్బాల్ ఆటగాడు. క్యాన్సర్ సర్వైవర్ అయి, పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయిన అతడు.. ప్రస్తుతం ఆశ్చర్యకరంగా 47 యేళ్ల వయసులో తండ్రి అయ్యాడు. దీంతో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. ఇతను1996లో సెలవుపై ఆస్ట్రేలియా వెళ్ళాడు. అప్పుడు అతడి వయసు 21 సంవత్సరాలు. ఆ సమయంలో వెన్నులో కణితి ఉన్నట్లు బయటపడింది. వైద్య పరీక్షలు చేయించగా.. ఈ కణితి హాడ్కిన్స్ లంఫోమా వల్ల ఏర్పడిందని, ఇది ఓ రకమైన క్యాన్సర్ అని వైద్యులు తెలిపారు.
రిషి సునక్ కోర్ కమిటీలో బీహార్ కుర్రాడు.. ఇంతకీ ఆ యువకుడి ప్రత్యేకతేంటీ..?
తర్వాత వైద్యులు కీమోథెరపీ చేశారు. అయితే చికిత్సకు ముందు వైద్యులు పీటర్ స్పెర్మ్ నమూనాలను తీసుకుని భద్రపరిచారు. తర్వాత విడతలవారీగా మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు కీమోథెరపీ చేశారు. ఈ చికిత్స వల్ల సాధారణంగానే రోగి స్పెర్ము కౌంట్ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. ఆ తరువాత పీటర్ క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యాడు. మామూలు జీవితం మొదలుపెట్టాడు.
ఇదిలా ఉండగా, కొన్నేళ్లుగా పీటర్, ఆరెలిజా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు అయితే ఆమెకు పిల్లలు కావాలనే కోరిక ఉండేది. కానీ పీటర్ క్యాన్సర్ చికిత్స కారణంగా అది సాధ్యం కాలేదు. ఇటీవల పీటర్ కు అయితే 26 ఏళ్ల క్రితం లండన్లోని యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్ లో భద్రపరిచిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే వాటి జీవితకాలం ఇన్నాళ్ళ వరకు ఉంటుందా, లేదా అనే సందేహం ఉండేది. విషయం తెలుసుకోవాలని వైద్యులను సంప్రదించాడు.
అప్పటి స్పెర్మ్ శాంపిల్స్ భద్రంగానే ఉన్నాయి అని, ఐవిఎఫ్ టెక్నాలజీతో బిడ్డను కనే వీలుందని వైద్యులు చెప్పారు. దీంతో ఈ చికిత్స కోసం రూ.28లక్షలు ఖర్చు చేశారు. ఎట్టకేలకు 26 ఏళ్ల తర్వాత తండ్రి అయ్యే అవకాశం లభించడంతో పీటర్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.