రిషి సునక్ కోర్ కమిటీలో బీహార్ కుర్రాడు.. ఇంతకీ ఆ యువకుడి ప్రత్యేకతేంటీ..?

By Rajesh KarampooriFirst Published Oct 28, 2022, 5:38 AM IST
Highlights

భారతీయ సంతతికి చెందిన రిషి సునక్  బ్రిటన్ ప్రధానిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన తన కోర్ కమిటీ ప్రకటించారు. ఇందులో  బీహార్ చెందిన  ప్రజ్వల్ పాండేకు అవకాశం కల్పించారు. 

భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ అరుదైన ఘనత సాధించారు. బ్రిటన్ ప్రధానిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన తన కోర్ కమిటీ ప్రకటించారు.  ఈ కమిటీలోకి బీహార్ చెందిన  ప్రజ్వల్ పాండేను చేర్చుకున్నారు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు చెందిన సివాన్‌లోని జిరాడీలో జన్మించిన ఈ యువకుడు బ్రిటన్‌లో తన ఖ్యాతిని చాటే పనిలో పడ్డారు. అతను సింద్రీకి చెందిన రిటైర్డ్ పిడిఐఎల్ ఉద్యోగి బాగీష్ దత్ పాండే మనవడు. ప్రజ్వల్ తల్లిదండ్రులు రాజేష్ పాండే (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్), మనీషా పాండేలు. వీరు సింద్రీలో నివసించారు.

ఈ సందర్భంగా ప్రజ్వాల్ మాట్లాడుతూ.. రిషి సునక్ ను ప్రధానిగా గెలిపించడం కోసం చాలా  కష్టపడ్డామని, అయితే మొదటిసారి విజయం సాధించకపోవడంతో అందరూ చాలా నిరాశకు గురయ్యారని చెప్పారు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత.. అవకాశం మళ్లీ వచ్చింది. సునాక్ బ్రిటన్ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటారని తాము హృదయపూర్వకంగా ఆశిస్తున్నామని  అన్నారు. 
 
రిషి సునక్ తో ప్రత్యేక అనుబంధం 

ఆగస్టు 2022లో రిషి సునక్ మొదటిసారి ప్రధాని అభ్యర్థి పోటీ చేసినప్పడు..  బీహార్‌కు చెందిన ప్రజ్వల్‌ను అతని పార్టీ ప్రధాన ప్రచార బృందంలో చేర్చుకుంది. అప్పటి నుంచి రిషి సునక్ తో ప్రజ్వల్ పాండేలకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అలాగే..ప్రజ్వల్ రిషి సునక్ బృందంలో పలువురు సీనియర్ పాలసీ సలహాదారులతో కలిసి పనిచేశాడు. అలాగే.. కమ్యూనికేషన్, ఔట్రీచ్ విభాగంలో కూడా పనిచేశాడు.

అంతకు ముందు ప్రజ్వల్ పాండే 16 సంవత్సరాల వయస్సులో 2019 సంవత్సరంలో కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ బ్రిటన్‌లో సభ్యునిగా చేరారు. 17 యేండ్ల  వయస్సులో, ప్రజ్వల్ ఎసెక్స్ క్లైమేట్ యాక్షన్ కమీషన్(మార్చి 2020)కి  కో-చైర్‌గా ఎన్నికయ్యారు.అక్కడ అతను లార్డ్ రాండాల్, ఐక్యరాజ్యసమితి ప్రధాన శాస్త్రవేత్తలు, హౌస్ ఆఫ్ లార్డ్స్ సహోద్యోగులతో కలిసి వాతావరణ విధాన రూపకల్పనపై పనిచేశాడు. ప్రజ్వల్ మొదటి నుంచీ ప్రామిసింగ్ స్టూడెంట్. ఆర్థిక శాస్త్రం, గణిత శాస్త్రంలో ఎన్నో విజయాలు సాధించారు. అతను తన పాఠశాలలో అనేక సార్లు పాఠశాల కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ప్రజ్వల్ పాండే 2019లో యూకే యూత్ పార్లమెంట్‌కు సభ్యునిగా ఎన్నికయ్యాడు. యూత్ పార్లమెంట్ సభ్యునిగా బ్రిటిష్ పార్లమెంట్‌లో మొదటిసారి ప్రసంగం చేశాడు. అతని సోదరి ప్రాంజల్ పాండే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి MBBS చదువుతోంది. 

ప్రజ్వల్ తల్లి మనీషా పాండేది రాంచీ, ఆమె గౌరీ శంకర్ నగర్ దొరండా నివాసి.ప్రజ్వల్ తండ్రి రాజేష్ దుర్గాపూజ కోసం తిరిగి సింద్రీకి వచ్చాడు. ఈ క్రమంలో తమ కొడుకు ఈ ఘనత సాధించినందుకు వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ప్రజ్వాల్ ను అతని కుటుంబ సభ్యులు అభినందనిస్తున్నారు.

click me!