మహిళలకన్నా పురుషుల్లో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి, శాస్త్రీయ కారణం ఇదే.....

By Sree s  |  First Published May 11, 2020, 2:41 PM IST

కరోనా వైరస్‌ తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ అని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. దీనికి గల కారణాలను కూడా విశ్లేషించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరూ దీనికి పక్కా శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం పేర్కొనలేదు. 


కరోనా వైరస్‌ తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ అని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. దీనికి గల కారణాలను కూడా విశ్లేషించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరూ దీనికి పక్కా శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం పేర్కొనలేదు.  

మగవారి జీవనశైలి , మహిళల్లో సాధారణంగా ఉండే అధిక రోగనిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు సాగించారు. కానీ, తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఓ ఆసక్తికరమైన ఆధారాన్ని తెరమీదకు తెచ్చింది.

Latest Videos

కొవిడ్‌-19 కారక ‘సార్స్‌-కొవ్‌2’ వైరస్‌ ‘యాంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2’ (ఏసీఈ2) అనే ఎంజైమ్‌ సాయంతో కణాల్లోకి ప్రవేశిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన ‘యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్’‌(యూఎంసీ) తమ అధ్యయనంలో గుర్తించింది. 

ఇది కణాల ఉపరితలంపై ఉండి కరోనా వైరస్‌ లోపలికి ప్రవేశించేందుకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే తేల్చారు. ఈ ఎంజైమ్‌ మహిళల కంటే పురుషుల రక్తంలో అధికంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆండ్రియాన్‌ వూర్స్‌ వివరించారు. అందువల్లే కరోనా వైరస్‌ ప్రభావం మగవారిలో అధికంగా ఉన్నట్లు విశ్లేషించారు

ఏసీఈ2 ఎంజైమ్‌ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లో ఉంటుందని.. వీటికంటే కూడా వృషణాల్లో అధికంగా ఉంటుందని వూర్స్‌ తెలిపారు. దీనివల్లే ఈ ఎంజైమ్‌ పురుషుల్లో అధికంగా ఉందని.. తద్వారా కరోనా వైరస్‌ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడానికి కారణమవుతోందని విశ్లేషించారు. 

మరోవైపు ఈ వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే దోహదపడుతోందని అంచనా వేశారు. అందుకే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అయితే, ఈ అంశంపై ఇంకా లోతైన పరిశోధన జరిపి ధ్రువీకరించాల్సిన అవసరం ఉందన్నారు

click me!