మరికొన్ని నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎప్పుడూ ఆయనను నేరుగా విమర్శించని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read:కరోనా కష్టకాలం: వైట్ హౌజ్ లో శాంతిమంత్రాన్ని పఠించిన హిందూ పూజారి, ఆలకించిన ట్రంప్
undefined
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. శుక్రవారం తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనతో పనిచేసిన అధికారులు, సిబ్బందితో ఒబామా వెబ్‌కాల్ ద్వారా మాట్లాడారు.
ఇది లీక్ అవ్వడంతో అమెరికాలో వైరల్‌గా మారింది. ఇందులో మైకేల్ ఫ్లైన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయ వ్యవస్థను దిగజార్చిందని ఒబామా మండిపడ్డారు. ఇదే సమయంలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తనతో కలిసి, జోయ్ బిడెన్ తరపున జరిగే ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.
Also Read:కరోనా ఎఫెక్ట్.. హెచ్1 బీ వీసాలపై తాత్కాలిక నిషేధం..?
స్వార్థం, అనాగరికం, వేర్పాటు, ఇతరులను శత్రువులుగా చూసే పద్ధతులతో పోరాడుతున్నామని.. ఇవన్నీ అమెరికా పౌరుల జీవితంపై ప్రభావం చూపుతున్నాయని ఒబామా వ్యాఖ్యానించారు. ఈ కారణంగా అమెరికా కరోనాపై పోరులో విజయం సాధించలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.