Russia Ukraine War: రష్యా ఆక్రమిత మరియుపోల్‌లో కలరా విజృంభణ.. వైద్య సేవలు అరకొరగానే.. యూకే ఆందోళన

Published : Jun 10, 2022, 03:08 PM IST
Russia Ukraine War: రష్యా ఆక్రమిత మరియుపోల్‌లో కలరా విజృంభణ.. వైద్య సేవలు అరకొరగానే.. యూకే ఆందోళన

సారాంశం

ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరవాసులకు యుద్ధ సమస్యే కాదు.. కలరా ముప్పు కూడా వచ్చి పడింది. ఈ తీర ప్రాంత నగరంలో భారీగా కలరా వ్యాపిస్తున్నట్టు యూకే రక్షణ శాఖ వెల్లడించింది. అంతేకాదు, ఇక్కడ వైద్య సేవలు కూడా కొరవడ్డాయని, ఔషధాల కొరత కూడా తీవ్రంగా ఉన్నదని, వైద్యారోగ్య వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలిపోయేది తెలియదని పేర్కొంది.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని కీలకమైన పోర్టు నగరం మరియుపోల్‌ను రష్యా కొన్ని వారాలపాటు యుద్ధం చేసి ఆక్రమించుకుంది. ఇక్కడ అజోవ్ స్టీల్ ప్లాంట్‌లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకుని రష్యాపై వీరోచిత పోరు జరిపిన సంగతి తెలిసిందే. మరియుపోల్‌లోని ఉక్రెయిన్ పౌరులకు రష్యా నుంచి వచ్చే బాంబు, బుల్లెట్ దాడులే కాదు.. మరో సమస్య కూడా వచ్చి పడింది.

ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత మరియుపోల్‌లో కలరా విజృంభించినట్టు యూకే రక్షణ శాఖ వెల్లడించింది. అంతేకాదు, ఈ నగరంలో కలరా పేషెంట్లకు చికిత్స అందించడానికి వైద్యారోగ్య వసతులు దాదాపు పతనం అంచులకు చేరాయని వెల్లడించింది. ఖెర్సాన్‌లో మెడిసిన్స్ కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలిపింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. చాలా వరకు నగరాలను రష్యా తన స్వాధీనం చేసుకుంది. ఉత్తర నుంచి దక్షిణం వరకు విశాలంగా వ్యాపంచి ఉన్న ఈ నగరాన్ని పూర్తిస్థాయిలో రష్యా ఆక్రమించుకోలేదని యూకే రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ప్రజలకు కనీస వసతులు కల్పించడానికి ఆపసోపాలు పడుతున్నట్టు పేర్కొంది. పరిశుభ్రమైన మంచి నీరు, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు, ఇతర అవసరాలను రష్యా ప్రభుత్వం వారికి అందించలేకపోతున్నదని యూకే రక్షణ శాఖ ఆరోపించింది.

మరియుపోల్‌లో భారీగా కలరా విజృంభిస్తున్నట్టు ఇదే సందర్భంగా యూకే పేర్కొంది. మే నెల నుంచి ఈ నగరంలో అక్కడక్కడ కలరా కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. అయితే, ఇక్కడ మెడిసిన్స్ షార్టేజీ ఉన్నట్టు తెలిపింది. ఎప్పుడు మొత్తంగా వైద్యారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందో తెలియని పరిస్థితి అని వివరించింది.

1995లో ఉక్రెయిన్ భారీగా కలరా కేసులను ఎదుర్కొన్నది. అప్పటి నుంచి స్వల్ప మొత్తంలో కలరా వ్యాప్తి అక్కడక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నది. ముఖ్యంగా మరియుపోల్ నగరంలో ఈ కలరా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయని వివరించింది. ఇలాంటి మరియుపోల్‌లో కలరా విజృంభణ పరిస్థితులను మరింత దిగజార్చే ముప్పు ఉన్నదని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే