నదిలో దూకి ఓనర్ సూసైడ్: అదే స్థలంలో యజమాని కోసం కుక్క ఎదురుచూపులు

By narsimha lodeFirst Published Jun 9, 2020, 1:14 PM IST
Highlights

యజమాని ఆత్మహత్య చేసుకొన్న బ్రిడ్జి వద్దే ఓ కుక్క ఆయన కోసం ఎదురు చూస్తోంది. నాలుగు రోజులుగా యజమాని కోసం ఆ కుక్క ఎదురుచూడడం పలువురిని కంటతడిపెట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఓ వ్యక్తి షోషల్ మీడియాలో  షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.


బీజింగ్: యజమాని ఆత్మహత్య చేసుకొన్న బ్రిడ్జి వద్దే ఓ కుక్క ఆయన కోసం ఎదురు చూస్తోంది. నాలుగు రోజులుగా యజమాని కోసం ఆ కుక్క ఎదురుచూడడం పలువురిని కంటతడిపెట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఓ వ్యక్తి షోషల్ మీడియాలో  షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

ఈ ఏడాది మే 30వ తేదీన చైనా దేశంలోని వుహాన్‌ పట్టణంలోని యాంగ్జీ వంతెనపై నుండి  ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే సమయంలో ఆయనతో పాటు కుక్క కూడ ఉంది.తన యజమాని తిరిగి వస్తాడని భావించిన ఆ కుక్క ఆ బ్రిడ్జి పేవ్‌మెంట్‌పైనే ఎదురుచూస్తోంది.

అదే బ్రిడ్జిపై రోజూ ప్రయాణిస్తున్న గ్జూ అనే వ్యక్తి ఈ కుక్కను పెంచుకోవాలని భావించాడు. తనతో పాటు ఆ కుక్కను ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ కుక్క మాత్రం తన ఇంటి నుండి పారిపోయి తిరిగి యాంగ్జీ వంతెనపైకి చేరుకొంది.

కుక్కను ఎంత వెతికినా ఆయనకు దొరకలేదు. యాంగ్జీ వంతెన వద్దకు వచ్చిన అతనికి కుక్క కన్పించింది. దీంతో అసలు ఈ కుక్క ఎందుకు ఇక్కడికి చేరుకొందో తెలుసుకొనేందుకు ఆయన ప్రయత్నించాడు.

also read:యజమాని కోసం మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే కుక్క ఎదురు చూపులు

మే 30వ తేదీన కుక్కతో కలిసి ఓ వ్యక్తి నడుచుకొంటూ వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా గుర్తించారు. చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయాన్ని గుర్తించలేదని అధికారులు తెలిపారు.సీసీటీవీ పుటేజీని పరిశీలించినా కూడ అతనిని గుర్తించలేకపోయారు.

ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో చీకటిగా ఉండడంతో బాధితుడిని గుర్తించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు చెప్పారు.అప్పటి నుండి కుక్క అక్కడే ఉన్నట్టుగా సీసీటీవీ పుటేజీలో రికార్డైంది. ఈ విషయాన్ని గ్టూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశాడు.

వంతెనపై కుక్క ఎదురుచూస్తున్న ఫోటోలను కూడ ఈ పోస్టుతో పాటు షేర్ చేశాడు. ఇది గమనించిన చిన్న జంతువుల రక్షణ అసోసియేషన్ డైరెక్టర్  డుఫన్ స్థానిక జంతువుల వలంటీర్లకు ఆ కుక్కను సంరక్షించాలని ఆదేశించారు.

ఈ కుక్కను పెంచుకొనేందుకు ముందుకు వచ్చే వారికి అప్పగించేందుకు డుఫన్ ప్రయత్నిస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ కుక్క పోస్టును చూసిన పలువురు నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. 
 

click me!