ప్రపంచంలో కరోనా కేసుల పెరుగుదలపై డబ్ల్యుహెచ్ఓ వార్నింగ్

By narsimha lode  |  First Published Jun 9, 2020, 11:17 AM IST

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందింది.  వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరుపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.


జెనీవా: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందింది.  వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరుపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా పక్షం రోజుల నుండి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.కేసుల తీవ్రతపై డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు 70 లక్షలు దాటడంపై ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని  డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయపడింది.

Latest Videos

undefined

also read:దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24గంటల్లో దాదాపు పదివేల కేసులు

ఐరోపాలో కేసుల సంఖ్య తగ్గుతున్నా ఇతర దేశాల్లో మాత్రం కరోనా కేసులు విపరీతంగా పెరగడంపై  మాత్రం  ఆ సంస్థ భయాందోళనలను వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు.

అమెరికా, దక్షిణ ఆసియాలోని 10 దేశాలనుంచి 75శాతం కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజులలో తొమ్మిది రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 

ఈ నెల 7వ తేదీన అత్యధిక సంఖ్యలో136,000 కేసులు నమోదయ్యాయన్నారు. ఆఫ్రికాలో చాలా దేశాలలో 1,000 కంటే తక్కువ కేసులు ఉన్నప్పటికీ, చాలా దేశాల్లో కొత్త ప్రాంతాల్లో విస్తరణ సహా కేసులు పెరుగుతున్నాయన్నారు.

అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని టెడ్రోస్ చెప్పారు. అయితే ఈ దేశాలలో అతిపెద్ద ముప్పు నిర్లక్ష్యమేనని  టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 71,93,476 మంది ఈ వైరస్‌ బారినపడగా  4,08,614 మందికి పైగా బాధితులు మరణించారు.

click me!