ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

Published : Jun 28, 2019, 09:13 AM IST
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

సారాంశం

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింి. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం నెవార్క్ సిటీకి వెళ్లడానికి గురువారం ఉదయం ముంబయి నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ191లో బాంబు ఉందంటూ బెదిరింపులు వచ్చాయి.  

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింి. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం నెవార్క్ సిటీకి వెళ్లడానికి గురువారం ఉదయం ముంబయి నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ191లో బాంబు ఉందంటూ బెదిరింపులు వచ్చాయి.  దీంతో.. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అత్యవసరంగా లండన్ లో ల్యాండ్ చేశారు.

బ్రిటన్‌ యుద్ధ విమానాలు రక్షణగా ఉండి ఏఐ191ను విమానాశ్రయానికి తీసుకొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.50 గంటలకు (భారత కాలమానంలో మధ్యాహ్నం 3.20 గంటలకు) ఏఐ–191 విమానం లండన్‌లో దిగింది. ఆ సమయంలో స్టాన్‌స్టెడ్‌ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. ఏఐ–191 నుంచి మొత్తం 327 మంది ప్రయాణికులను కిందకు దింపారు. విమానంలో బాంబులు ఏవీ దొరకక పోవడంతో ఆ బెదిరింపులు నకిలీవని తేలింది.

విమానం బయలుదేరిన అనంతరం ముంబై విమానాశ్రయ అధికారులకు ఓ బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది. సెర్గీ సెలిజ్‌నెవ్, నటాలియా ఝ్మురినా అనే వ్యక్తులు ఈమెయిల్‌ పంపుతూ, ముంబై నుంచి నెవార్క్‌ వెళ్తున్న విమానం గాలిలోనే పేలిపోతుందని బెదిరించారు. దీంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం