ఏలియన్స్ కిడ్నాప్ చేశారు: సంచలన విషయాలు వెల్లడించిన అమెరికన్

By Siva KodatiFirst Published Jun 27, 2019, 4:14 PM IST
Highlights

మనిషి దశాబ్ధాలుగా గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

ఈ విశాల ప్రపంచంలో మనం ఒంటరి వాళ్లం కాదని.. విశ్వంలో ఎక్కడో చోట జీవం ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఎన్నో చోట్ల తాము ఏలియన్స్‌ను చూశామని పలువురు తెలిపిన సందర్భాలు ఏన్నో ఉన్నాయి.

దీంతో మనిషి దశాబ్ధాలుగా గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.

వీటిపై హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన పార్కర్ తను.. తనతో పాటు మరో వ్యక్తిని ఏలియన్స్ కిడ్నాప్ చేశారని అంటున్నారు.

1973 ప్రాంతంలో తాను.. హిక్సన్ అనే మరో వ్యక్తితో కలిసి ఓ షిప్‌యార్డ్‌లో కూలీలుగా పని చేసేవాళ్లం. ఓ రోజు తామిద్దరం విధులు ముగిసిన తర్వాత చేపలు పడుతూ కూర్చున్నాం. ఆ సమయంలో తమ వెనుక ఏదో వాహనం ఆగిన శబ్ధం వినిపించింది.

తిరిగి చూస్తే.. నీలం రంగు వెలుతురు తమ వైపుకు రావడం కనిపించింది. ఆ వెనకే ఓ 30 అడుగుల భారీ నౌక లాంటిది అక్కడ దిగిందని... కాసేపటి తర్వాత అందులోంచి మూడు చిన్న చిన్న వింత ఆకారాలు బయటకు వచ్చాయని పార్కర్ తెలిపాడు.

ఆ వింత జీవులు మమ్మల్ని తాము వచ్చిన వాహనంవైపు లాగడం ప్రారంభించాయని.. లోపలికి వెళ్లిన తర్వాత మేమిద్దరం గాలిలో తేలుతున్నామని పేర్కొన్నాడు.

ఇంతలో ఆ వింత జీవులు తమ శరీరం మీద ఉన్న పెద్ద కన్ను ఇంటి ఆకారంతో తమని పరీక్షించాయని... కాసేపటి తర్వాత ఆ వింత జీవులు తామిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాయో అక్కడే వదిలి వెళ్లాయన్నారు.

తమకు స్పృహ వచ్చే సరికి తామిద్దరం ఆకాశం వైపు చేతులు ఎత్తి సాయం కోసం అర్ధిస్తున్నట్లు ఉన్నామని గుర్తు చేసుకున్నారు. అలాగే తమ అర చేతులకు గాయాలు కూడా అయినట్లు గుర్తించామని.. అయితే ఈ విషయాన్ని తాము అధికారులకు చెప్పినప్పటికీ వారు నమ్మలేదని, తాగి ఉన్నామని అనుకున్నారు.

కానీ మేం పాలిగ్రాఫ్ పరీక్షలో పాస్ కావడంతో అప్పటికీ గాని అధికారులకు నమ్మకం కుదరిందని చెప్పారు. ఆ తర్వాత ఈ విషయం గురించి అప్పట్లో వాషింగ్టన్ పోస్ట్‌లో కూడా వచ్చిందని స్పష్టం చేశారు. అయితే 2011లో తన మిత్రుడు హిక్సన్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

click me!