కరడుగట్టిన ముస్లిం దేశంలో శ్రీరాముని ఆనవాళ్లు

Siva Kodati |  
Published : Jun 27, 2019, 04:42 PM IST
కరడుగట్టిన ముస్లిం దేశంలో శ్రీరాముని ఆనవాళ్లు

సారాంశం

ముస్లిం దేశమైన ఇరాక్‌లో శ్రీరామచంద్రుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. హోరెన్ షెకాన్ ప్రాంతంలోని దర్బాంద్ ఇ బెలుల కొండ రాళ్లపై ఉన్న వీటిని ఉత్తరప్రదేశ్‌ నుంచి వెళ్లిన అయోధ్య శోధ్ సంస్థాన్ బృందం గుర్తించింది.

ప్రపంచం మొత్తం ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్ధలు రక్తపాతాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరడుగట్టిన ఇస్లాంను పాటించే ఎన్నో దేశాల్లో వేరే మతానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయడాన్ని మనం చూశాం.

ఈ క్రమంలో ముస్లిం దేశమైన ఇరాక్‌లో శ్రీరామచంద్రుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. హోరెన్ షెకాన్ ప్రాంతంలోని దర్బాంద్ ఇ బెలుల కొండ రాళ్లపై ఉన్న వీటిని ఉత్తరప్రదేశ్‌ నుంచి వెళ్లిన అయోధ్య శోధ్ సంస్థాన్ బృందం గుర్తించింది.

వీటిలో ఒకటి శ్రీరాముడు విల్లు పట్టుకున్నట్లుగానూ.. మరొకటి మారుతి రూపంలోనూ ఉందని తెలిపారు. ఇవి క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నాటివిగా భావిస్తున్నారు.

ప్రాచీన కాలంలో అత్యున్నత నాగరికతలైన సింధు, మెసపటోమియా నాగరికతల మధ్య సంబంధాన్ని వీటి ద్వారా గుర్తించే అవకాశం కలుగుతుందని వారు తెలిపారు. అయితే చిత్రాలు గతంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన రాజుదై ఉండవచ్చని ఇరాక్ చరిత్రకారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..