లాక్ డౌన్ దెబ్బ: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తొలిగింపు, వీధినపడుతున్న ఉద్యోగులు

By Sree s  |  First Published May 27, 2020, 8:17 AM IST

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల డిమాండ్ బాగా పడిపోయినందున సాఫ్ట్ వేర్ కంపెనీలు చిన్నగా తమ ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీనికి ఫ్యాన్సీ పేర్లు కూడా పెట్టేశాయి. కాగ్నిజెంట్ కంపెనీ వాలంటరీ సెపరేషన్ ప్యాకేజి అనే పేరుతో ఉద్యోగుల భారాన్ని తగ్గించుకునే యోచనలో ఉంది. 


కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా కూడా డిమాండ్ పడిపోయింది. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ తాము మాత్రం ఇండ్లలోంచి పని చేస్తున్నాము కాబట్టి మా ఉద్యోగాలకు వచ్చిన నష్టం ఏమిలేదు అని భావిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై ఒక పిడుగులాంటి వార్త పడేందుకు సిద్ధంగా ఉంది. 

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల డిమాండ్ బాగా పడిపోయినందున సాఫ్ట్ వేర్ కంపెనీలు చిన్నగా తమ ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీనికి ఫ్యాన్సీ పేర్లు కూడా పెట్టేశాయి. కాగ్నిజెంట్ కంపెనీ వాలంటరీ సెపరేషన్ ప్యాకేజి అనే పేరుతో ఉద్యోగుల భారాన్ని తగ్గించుకునే యోచనలో ఉంది. 

Latest Videos

undefined

తాజాగా ఆ కంపెనీ ఉద్యోగులకు పంపుతున్న మెయిల్స్ ని చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పటివరకైతే అది అమెరికాలో పనిచేస్తున్న అసోసియేట్స్ కి మాత్రమే వర్తిస్తున్నట్టుగా కనబడుతున్నప్పటికీ..... త్వరలోనే భారతదేశంలో కూడా ఈ తరహా లేఆఫ్స్ ఉండబోతున్నాయనేది అర్థమవుతున్న విషయం. 

బయట డిమాండ్ తక్కువగా ఉన్నందున, ప్రాజెక్టులు ఎక్కువగా లేనందున, అరకొర ఉద్యోగులతో మాత్రమే కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహించాలని చూస్తున్నాయి. తాజాగా ఇందుకోసమని కంపెనీలు తమ ఉద్యోగులను బెంచ్ మీదకు వెళ్లిపోయేందుకు అవకాశం కల్పిస్తుంది. 

అలా వారు బెంచ్ మీదకు వెళ్ళిపోతే వారికి 8 వారల జీతం( దాదాపుగా 2 నెలల కాలం) జీతాలను కూడా ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఆ కాలం తరువాత కంపెనీతో సదరు ఉద్యోగి పూర్తి సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోతాయి. ఒకరకంగా కంపెనీ నుండి సెపరేట్ అవడానికి ఈ 8 వారల జీతం ఎక్స్చేంజి ఆఫర్ అన్నమాట. 

ఇక్కడొక ఆసక్తికర అంశం ఏమిటంటే.... ఎవరైనా ఈ ప్యాకేజి వద్దంటే... వారు ఆగష్టు నెలాఖరులోపు కంపెనీ టాలెంట్ పూల్ లో ఉంటూ నూతన ప్రాజెక్టులను అన్వేషించుకోవాలని తెలిపింది. ఇక్కడొక మెలిక కూడా పెట్టింది. అలా వెదికిన తర్వాత కూడా ప్రాజెక్ట్ దొరక్కపోతే అప్పుడు ఉద్యోగికి ఇప్పుడు ఇచ్చినట్టు రెండు నెలల జీతం మాత్రం కంపెనీ ఇవ్వదు. 

కాబట్టి ఉద్యోగి ఇప్పుడు ఒకేసారి ఉద్యోగం కావాలో వద్దో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఉద్యోగులు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉండడానికి ఉద్యోగులకు రెండు వారల గడువు ఇవ్వడం కొసమెరుపు.  

ఇదే విషయాన్నీ కాగ్నిజెంట్ ప్రతినిధులు కూడా అంటున్నారు. అంతర్గతంగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే కొందరు అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెయిల్స్ పంపినట్టు తెలియవస్తుంది. త్వరలో అందరు ఉద్యోగులకు కూడా ఇది పంపనున్నట్టు తెలియవస్తుంది. 

click me!