హెయిర్ సెలూన్‌లో కటింగ్ చేసుకొన్న 91 మందికి కరోనా

By narsimha lodeFirst Published May 26, 2020, 3:15 PM IST
Highlights

సెలూన్లో కటింగ్ చేసుకొన్న 84 మందితో పాటు ఏడుగురు సిబ్బందికి కూడ కరోనా సోకింది.  లాక్ డౌన్ ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున జనం కటింగ్ కోసం సెలూన్లకు వచ్చారు. దీంతో కరోనా వ్యాపించింది.


మిస్సోరి: సెలూన్లో కటింగ్ చేసుకొన్న 84 మందితో పాటు ఏడుగురు సిబ్బందికి కూడ కరోనా సోకింది.  లాక్ డౌన్ ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున జనం కటింగ్ కోసం సెలూన్లకు వచ్చారు. దీంతో కరోనా వ్యాపించింది.

లాక్ డౌన్ ఎత్తివేయడంతో అమెరికాలోని మిస్సోరీలో జనం పెద్ద ఎత్తున గ్రేట్ క్లిప్స్ అనే సెలూన్ కు వచ్చారు. మే 12నుంచి మే 21వరకు సెలూన్ లో కష్టమర్లు ఎక్కువగా వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. 

also read:హైడ్రాక్సీ క్లోరోక్విన్ వద్దు.. డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ ప్రకటన

ఈ సెలూన్ లో కటింగ్ చేసుకొన్న 84 మందికి కరోనా సోకింది. ఇదే సెలూన్ లో పనిచేస్తున్న ఏడుగిరికి కూడ కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖాధికారులు ఈ సెలూన్ లో కటింగ్ చేసుకొన్న వారికి పరీక్షలు నిర్వహిస్తే 91 మందికి కరోనా సోకిందని తేలింది. వీరిని ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

టెక్సాస్ లో ప్రజారోగ్య ఉత్తర్వులను ధిక్కరించి కటింగ్ షాపును యజమాని జైలు శిక్షను అనుభవించాడు. మిచిగాన్ లో సెలూన్ ను మూసివేసేందుకు ఓ యజమాని నిరాకరించినట్టుగా స్థానిక మీడియా తెలిపింది.

సెలూన్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఇదే ఘటన చోటు చేసుకొంది. అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

click me!