చైనాలో కొవిడ్ కేసులు ఉధృతం.. నిమ్మకాయలకు ఒక్క ఉదుటున పెరిగిన డిమాండ్

By Mahesh KFirst Published Dec 20, 2022, 6:28 PM IST
Highlights

చైనాలో కొవిడ్ కేసులు ఉధృతం అయ్యాయి. జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం లైట్ తీసుకోవడంతో కేసులు భారీగా పెరిగాయి. ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి సహజ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గుతున్నారు. ఫలితంగా నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరిగాయి.
 

న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనా కేసులతో సతమతం అవుతున్నప్పుడు చైనాలో కేసులు అదుపులోనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా చైనా జీరో కోవిడ్ పాలసీ అమలు చేస్తున్నది. లక్షలాది మందిని ఇంటి గడప దాటనివ్వలేదు. ఈ లాక్‌డౌన్‌లో శాంఘై వంటి కొన్ని నగరాల్లో ప్రజలు క్షోభతో తమ ఇంటి గదుల్లో నుంచే పిచ్చిగా అరుపులు వేసిన వీడియోలు కలకలం రేపాయి. కరోనా కేసులు ఇప్పుడు ఇతర దేశాల్లో ఓ కొలిక్కి వచ్చాయి గానీ.. చైనాలో మాత్రం గణనీయంగా పెరిగాయి. జీరో కోవిడ్ పాలసీని ఆకస్మికంగా పక్కన పెట్టడంతో కేసులు భారీగా పెరగడమే కాదు.. ఇమ్యూనిటీ పెంచుకోవడంపై ప్రజల్లోనూ ఆందోళనలు పెరిగాయి. తమకు అందుబాటు ధరల్లో డ్రగ్స్‌కు బదులు సహజమైన ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ సీ పుష్కలంగా లభించే సహజమైన పండ్లు, కూరగాయాల కోసం వెతుకుతున్నారు. దీంతో విటమిన్ సీ అధికంగా నిల్వ ఉండే నిమ్మకాయలకు డిమాండ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగింది.

చైనాకు చెందిన ఓ రైతు వెన్‌ను బ్లూమ్‌బెర్గ్ సంప్రదించి నిమ్మకాయలపై ఆరా తీసింది. సిచువన్ ప్రావిన్స్‌లోని అన్యూ కౌంటీలో వెన్ 130 ఎకరాల్లో నిమ్మకాయలు పండిస్తున్నాడు. చైనాలో 70 శాతం పండ్లను సిచువాన్ పండిస్తున్నది. గత వారం రోజుకు ఐదు నుంచి ఆరు టన్నుల నిమ్మకాయలు విక్రయించినట్టు వెన్ తెలిపాడు. కానీ, ఇప్పుడు ఈ డిమాండ్ 20 టన్నుల నుంచి 30 టన్నులకు పెరిగిందని వివరించాడు.

కరోనా కేసులు ఊహించని రీతిలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నిమ్మకాయల కోసం పరుగులు పెడుతున్నారు. గడిచి నాలుగు లేదా ఐదు రోజుల్లో నిమ్మకాయల ధరలు రెట్టింపు అయ్యాయని మరో రైతు తెలిపారు. దేశవ్యాప్తంగా నిమ్మకాయల కోసం ఇక్కడి రైతులకు ఆర్డర్లు వస్తున్నాయని, దీంతో వారు రోజుకు 144 గంటలు పని చేస్తున్నారని వివరించారు. నిమ్మకాయలతోపాటు ఆరెంజ్‌లు, పియర్స్ పండ్ల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌కు చెందిన ఫ్రెషిపప్పో ప్లాట్‌ఫామ్స్‌లో విక్రయాలు 900 శాతం పెరిగింది.

Also Read: చైనాలో కరోనా కలవరం.. ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోందన్న అమెరికా విదేశాంగ శాఖ

మొన్నటి వరకు కూరగాయలు, పండ్ల రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని దుస్థితిలో గత నెల వరకు ఉన్నారు. కరోనా ఆంక్షలతో వీటిని మార్కెట్‌లోకి తీసుకెళ్లడం, మార్కెట్‌లో విక్రయాల వరకు దారుణంగా ఉన్నాయి. కానీ, ఇవన్నీ జీరో కోవిడ్ పాలసీని పక్కకు పెట్టడంతో ఒక్కసారిగా మారిపోయాయి. 

ఆరోగ్యానికి నిమ్మకాయలు మంచివని ప్రజలు హఠాత్తుగా రియలైజ్ అయ్యారేమో అని ఓ రైతు తెలిపారు. ఈ ఆసక్తే ఇక పైనా కొనసాగాలని కోరుకున్నాడు.

కరోనాను నివారిండానికి, ఎదుర్కోవడానికి విటమిన్ సీ సమర్థంగా పని చేస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలేవీ లేవు.

click me!