షాకింగ్.. 15యేళ్ల బాలుడి పొట్టలో... మూడు అడుగుల పొడవైన ఛార్జింగ్ కేబుల్‌...!!

By SumaBala BukkaFirst Published Dec 19, 2022, 2:15 PM IST
Highlights

టర్కీలోని ఓ 15యేళ్ల బాలుడి పొట్టలో మూడడుగుల పొడవైన చార్జింగ్ కేబుల్ వైర్ ను తీశారు. దీంతోపాటు హెయిర్ బ్యాండ్ కూడా ఉండడం విచిత్రం. 

టర్కీ : టర్కీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. వాంతులు, వికారంతో ఆసుపత్రిలో చేరిన యువకుడి కడుపులో ఉన్న వస్తువు చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి అతడి పొట్టలోనుంచి  మూడు అడుగుల పొడవైన ఛార్జింగ్ కేబుల్‌ ను బయటికి తీశారు. ఈ మేరకు స్థానిక ఔట్‌లెట్ టర్కీ పోస్ట్స్‌లో ఒక నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఆగ్నేయ టర్కీలోని దియార్‌బాకర్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. 15 ఏళ్ల అబ్బాయికి తీవ్ర అనారోగ్యం కారణంగా, కుటుంబ సభ్యులు అతడిని ఫిరత్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించారు.

వెంటనే బాలుడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్-రే తీయించమని తల్లిదండ్రులకు తెలిపారు. అందులో వారికి కేబుల్ వైరు కనిపించింది. బాలుడు ఆ వస్తువును ఎలా తిన్నాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, ఆసుపత్రిలోని పోషకాహార విభాగం అధిపతి, యాసర్ డోగన్, టర్కీ పోస్ట్‌ల ప్రకారం, బాలుడి కడుపు లోపల ఇంకా ఏమైనా ఉన్నాయా.. కనుక్కోవడానికి ఎండోస్కోపీ చేయనున్నారు.

కెనడాలోని టొరంటోలో కాల్పుల కలకం, 5గురు మృతి.. ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి

అయితే, ఆపరేషన్ చేయడం చాలా కష్టం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. కేబుల్ ఒక చివర చిన్న ప్రేగులలోకి వెళ్ళింది. దీంతో ఆపరేషన్ క్లిష్టం అయ్యింది. అని పేర్కొన్నారు. అయితే, చాలా జాగ్రత్తగా శస్త్రచికిత్స చేయడం ద్వారా ఆపరేషణ్ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తయింది. రోగిని రెండు గంటల్లోనే డిశ్చార్జ్ చేశారు. రోగికి 15 సంవత్సరాల వయస్సు ఉన్నందున, ఇది ప్రమాదవశాత్తు మింగింది కాదని వైద్యులు అంటున్నారు. అందుకోసం మానసిక నిపుణులతో బాలుడిని పరీక్షించాలని వైద్యులు అంటున్నారు. 

కేబుల్ బయటకు తీసిన తరువాత, అది మూడు అడుగుల పొడవు ఉన్నట్లు కనుగొన్నారు. బాలుడి పొట్ట లోపల హెయిర్ టై కూడా ఉన్నట్లు తేలింది. గత సంవత్సరం, ఒక పసిబిడ్డ కడుపులోనుంచి 17 అయస్కాంత బాల్స్ ను  శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా తొలగించామని, వాటిని చిన్నారి తెలియక మింగాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన టర్కీలోని పముక్కలేలో చోటుచేసుకుంది.

click me!