పాక్ లో లైవ్ డిబేట్ లో ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ గా మారింది.
పాకిస్థాన్ : ప్యానలిస్ట్‌లు, న్యూస్ యాంకర్‌లు ఒకరిమీద ఒకరు వాగ్భాణాలు వేసుకోవడం, కొట్టుకోవడం లాంటి ఘటనలతో పాకిస్తాన్ వార్తా ఛానెల్‌లు సంవత్సరాలుగా అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నాయి. తాజాగా ప్యానలిస్టులుగా వచ్చిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎమ్‌ఎల్-ఎన్)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)తో సంబంధం ఉన్న ప్రముఖ వ్యక్తి షేర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్‌లు లైవ్ లో చితకబాదుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రాజకీయ చర్చా కార్యక్రమంలో, ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం వేడెక్కింది. మొదట ఇద్దరూ అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. ఆ తరువాత కాసేపటికే ముష్టిఘాతాలకు దిగారు. దీంతో చానల్ సిబ్బంది, ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. ప్రముఖ టీవీ హోస్ట్ జావేద్ చౌదరి హోస్ట్ చేసిన కల్ తక్ కార్యక్రమంలో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ తప్పు చేశారని, మిలిటరీ అధికారులతో బ్యాక్‌డోర్ చర్చలు జరిపారని పీఎంఎల్-ఎన్ సెనేటర్ ఆరోపించారు.కానీ,మార్వాట్ ఈ వాదనలు ఒప్పుకోలేదు.ఎదురుదాడికి దిగాడు.
undefined
Zealandia: 'జిలాండియా' భూమిపై ఉన్న 8వ ఖండం.. 375 ఏండ్ల తర్వాత కనుగొన్న శాస్త్రవేత్తలు.. !
వాస్తవాలను బయటపెడుతూ.. ఎదురుదాడి చేయడానికి బదులుగా, తన సీటుపై నిలబడి ఖాన్ తలపై గట్టిగా కొట్టాడు. ఊహించని ఈ దెబ్బలకు సెనేటర్ ఒక్క నిమిషం షాక్ అయి, తేరుకున్నాడు. ఆ తరువాత లేచి నిలబడి, కెమెరాకు దూరంగా మార్వాట్‌ను నేలపై తోశాడు. అతనిమీద మృష్టి ఘాతాలకు దిగాడు.
అదొక హెవీవెయిట్ బాక్సింగ్ రౌండ్ ను తలపించింది. దీంతో సిబ్బంది, హోస్ట్ వారిని విడదీయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇరువురు నేతలు విడిపోయిన తర్వాత కూడా వారు ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ ఘటన తర్వాత, సెనేటర్ అఫ్నాన్ X లో దీనికి సంబంధించిన వివరాలు షేర్ చేశారు.
"నిన్న జరిగిన టాక్ షోలో మార్వాట్ నాపై దాడి చేసాడు, నేను అహింసను నమ్ముతాను కానీ నేను నవాజ్ షరీఫ్ సైనికుడిని. మార్వాత్ ఎలాంటి ట్రిక్ చేశాడో.. అన్ని PTI లకు, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్‌కు ఒక గుణపాఠం, వారు ఏదీ అంగీకరించరు. కనిపించకుండా పెద్ద నల్ల అద్దాలు ధరించారే ”అని ఖాన్ పోస్ట్ చేశాడు.
مروت نے کل ٹاک شو میں مجھ پر حملہ کیا، میں عدم تشدد پر یقین رکھتا ہوں مگر میں نواز شریف کا سپاہی ہوں۔ جو پھینٹا مروت کو لگایا ہے یہ تمام پی ٹی آئی اور بالخصوص عمران خان کے لیے ایک اہم سبق ہے، کہیں شکل دیکھانے کے قابل نہیں رہیں گے، بڑی بڑی کالی عینکیں لگانی پڑیں گی۔😁 pic.twitter.com/si4jvyboeJ
— Senator Dr. Afnan Ullah Khan (@afnanullahkh)