ఆడమ్ బ్రిట్టన్ అనే ఒక బ్రిటిష్ మొసలి నిపుణుడు డజన్ల కొద్దీ కుక్కలమీద అత్యాచారానికి పాల్పడ్డాడు. వాటిని చిత్రహింసలకు గురిచేశాడు. ఇది వెలుగులోకి రావడంతో అతడిని అరెస్ట్ చేశారు. తన మీద వచ్చిన 60 ఆరోపణలను అతను అంగీరించాడు.
యూకే : జంతువుల మీద దుర్వినియోగానికిపాల్పడుతున్నాడన్న ఆరోపణలతో ప్రఖ్యాత బ్రిటిష్ మొసలి నిపుణుడు ఆడమ్ బ్రిట్టన్ ఏప్రిల్ 2022లో అరెస్టయిన సంగతితెలిసిందే. మృగత్వ చర్యలకు సంబంధించి అతనిపై ఉన్న 60 ఆరోపణలను అంగీకరించాడు.
బీబీసీ నివేదిక ప్రకారం, ఆడమ్ బ్రిట్టన్ డజన్ల కొద్దీ కుక్కలను అవి చనిపోయే వరకు హింసించాడు. అంతేకాదు.. వాటిని హింసిస్తూ అదంతా చిత్రీకరించాడు. దీన్ని బ్రిటన్ ఒప్పుకున్నాడు. బ్రిటన్ తన అన్ని వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతేకాదు చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ ను కూడా యాక్సెస్ చేసాడని నివేదికలో పేర్కొన్నారు.
undefined
తన ఇంటి ఓపెన్ ఏరియాలో ఓ షిప్పింగ్ కంటైనర్‌లో రికార్డింగ్ పరికరాలను అమర్చి అందులో జంతువుల మీద టార్చర్ కు పాల్పడేవాడు. దీన్ని అతను టార్చర్ రూం అని పిలిచేవాడని కోర్టు తన విచారణలో తెలిపింది. అతని అరెస్టుకు ముందు 18 నెలల్లో అతను హింసించిన 42 కుక్కలలో 39 చనిపోయాయి. సోమవారం నార్తర్న్ టెరిటరీ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి మైఖేల్ గ్రాంట్ ప్రజలను కోర్టు గది నుండి బయటకు వెళ్లమని కోరారు.
కేసులో వెలుగు చూసిన వాస్తవాలు "నరాలు చిట్లిపోయేలా" ఉన్నాయని... ఇది ఆందోళన కలిగిస్తుందని గ్రాంట్ అన్నారని నివేదిక పేర్కొంది. ప్రాసిక్యూటర్లు ఇంకా వివరాలు తెలుపుతూ బ్రిటన్ కనీసం 2014 నుండి జంతువులపై "శాడిస్ట్ లైంగిక ఆసక్తి" కలిగి ఉన్నాడన్నారు. ఈ కారణంగానే, అతను తన స్వంత పెంపుడు జంతువులపై లైంగిక దాడి చేసాడు. వేరే కుక్కల యజమానులను కూడా నమ్మించి తమ పెంపుడు కుక్కలను ఇచ్చేలా చేశాడు.
దీనికోసం.. ప్రయాణాల సమయంలో లేదా ఆఫీస్ వేళల్లో తమ పెంపుడు జంతువులను చూసుకోవాలని వెతికేవారికోసం.. ఇంటర్నెట్లో బ్రిటన్ వెతికాడు. వాటిని తనకే ఇచ్చేలా చేయడం కోసం వారితో సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. యజమానులు తమ పెంపుడు జంతువులకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం బ్రిటన్‌ను సంప్రదించినట్లయితే, వారికి అతను తప్పుడు కథనాలు చెప్పి.. పాత ఫోటోలను పంపేవాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.
బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్ ప్రొడక్షన్స్‌లో పనిచేసిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త బ్రిటన్‌కు తదుపరి తేదీలో శిక్ష విధించబడుతుంది. అతను మొసళ్లతో పని చేయడానికి 20 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు.