కొలంబియాలో ప్రకృతి విలయం .. కొండచరియలు విరిగిపడి 33 మంది మృతి.. పలువురికి గాయాలు..

By Rajesh KarampooriFirst Published Dec 6, 2022, 10:45 AM IST
Highlights

కొలంబియాలో ఆదివారం ఓ భయంకరమైన కొండచరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ బస్సు, అనేక వాహనాలు కొండ చరియల కింద చిక్కుకున్నాయి. ఇప్పటివరకు.. ముగ్గురు మైనర్లతో సహా 33 మంది మృతదేహాలను వెలికి తీశారు. అదే సమయంలో మరో తొమ్మిది మందిని శిధిలాల నుండి సజీవంగా బయటికి తీశారు. వారిలో నలుగురి పరిస్థితి విషయంగా ఉంది. 

గత కొన్ని రోజులుగా కొలంబియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానం ఈ వారం రోజులుగా కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని నగరం బొగోటాకు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతంలో ఆదివారం నాడు ఓ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది శిధిలాల కింద చిక్కుకున్నారు.

రేసరాల్డా ప్రావిన్స్‌లోని ప్యూబ్లో రికో మరియు శాంటా సిసిలియా గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కేవలం 9 మందిని మాత్రమే రక్షించగలిగామని జాతీయ విపత్తు ఏజెన్సీ తెలిపింది. భారీ వర్షం కారణంగా.. రిసరాల్డా ప్రావిన్స్‌లో మట్టి కురుకుపోయింది. దీంతో అనేక భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 

ఈ ఘటనపై కొలంబియా హోంమంత్రి అల్ఫోన్సో ప్రాడా మాట్లాడుతూ.. ముగ్గురు మైనర్లతో సహా 33 మంది మరణించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో.. తొమ్మిది మందిని రక్షించగలిగారు. వారిలో నలుగురు వ్యక్తులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ విపత్తుపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందని భరోసా తెలిపారు.

మీడియా నివేదికల ప్రకారం.. ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు నుండి సజీవంగా బయటకు వచ్చిన ఒక వ్యక్తి.. బస్సును శిథిలాల నుండి కాపాడటానికి డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడని చెప్పాడు. కొండచరియలు విరిగిపడ్డ తరువాత కూడా.. అతను బస్సును తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయిందని తెలిపాడు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రిలో చేర్పించారు.

ఏడు లక్షల మందిపై ప్రభావం 

ప్రభుత్వ డేటా ప్రకారం.. లా నినా ప్రాంతంలో ఆగస్టు 2021 నుంచి నవంబర్ 2022 మధ్య కాలంలో విపత్తుల కారణంగా.. 271 మంది ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ యూనిట్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ అంచనా ప్రకారం.. 348 మంది గాయపడ్డారు. దాదాపు  7 లక్షల మంది ప్రభావితమయ్యారు. అంతకుముందు ఫిబ్రవరిలో 14 మంది మరణించగా..35 మంది గాయపడ్డారు.
 

click me!