కొవిడ్ వైరస్ మనిషి తయారు చేసిందే.. వుహాన్ ల్యాబ్ నుంచే లీక్.. అమెరికా తప్పు కూడా ఉంది: వుహాన్ ల్యాబ్ సైంటిస్టు

By Mahesh KFirst Published Dec 5, 2022, 5:06 PM IST
Highlights

కొవిడ్ వైరస్‌ మనిషి తయారు చేసినదే అని, వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని ప్రముఖ పరిశోధకుడు, సైంటిస్టు ఆండ్రూ ఆఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాకు వీటికి అమెరికానే ఫండింగ్ ఇచ్చిందని ఆరోపణలు చేశారు.
 

న్యూఢిల్లీ: కొవిడ్ వైరస్ మనిషి తయారు చేసిందేనని, అది చైనాలోని వుహాన ల్యాబ్ నుంచే లీక్ అయిందని ఆ ల్యాబ్‌లో పని చేసిన  సైంటిస్టు తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పొరపాటుకు అమెరికాను కూడా నిందించాల్సిందే అని తెలిపారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సందర్భంలోనే చాలా మంది వుహాన్ ల్యాబ్ వైపు వేలు ఎత్తి చూపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వుహాన్ ల్యాబ్ నుంచే ఈ వైరస్ లీకైందని, మరో జంతువుల మార్కెట్‌లో ఈ వైరస్ మనుషులకు సోకింది అని రకరకాలుగా ఆరోపణలు పుట్టుకొచ్చాయి. వుహాన్ ల్యాబ్ పై వచ్చిన ఆరోపణలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా చైనాకు వెళ్లి పరిశీనలు జరిపిన సంగతి తెలిసిందే.

అమెరికాకు చెందిన పరిశోధకుడు ఆండ్రూ హఫ్ తన కొత్త పుస్తకం ‘ది ట్రుత్ అబౌట్ వుహాన్’లో సంచలన విషయాలు పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే ఈ వైరస్ లీక్ అయిందని తెలిపాడు. మరికొన్ని విషయాలను ఆయన బ్రిటీష్ పేపర్ ది సన్‌కు వివరించగా.. వాటిని పేర్కొంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది.

కరోనా వైరస్‌లపై అమెరికా ప్రభుత్వం చైనాకు ఫండింగ్ చేయడం వల్లే ఈ మహమ్మారి వచ్చిందని ఈ పుస్తకంలో హఫ్ పేర్కొన్నాడు. న్యూయార్క్‌లోని స్వచ్ఛంద సంస్థ ఎకోహెల్త్ అలయెన్స్ అంటువ్యాధుల గురించి అధ్యయనం చేస్తుంది.

Also Read: corona virus : క‌రోనా వైర‌స్ వుహాన్ ల్యాల్ లో పుట్టిందా ? డ‌బ్లూహెచ్ వో శాస్త్ర‌వేత్త ఏమ‌న్నారంటే ?

విదేశీ ల్యాబ్‌ల్లో కచ్చితమైన నియంత్రణ చర్యలు లేవని, బయో సేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటివాటిపై కచ్చితమైన నియంత్రణలు లేవని ఆయన పేర్కొన్నారు. అందుకే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని తన పుస్తకంలో తెలిపారు. అమెరికాకు చెందిన ప్రైమరీ ఏజెన్సీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ ద్వారానే వుహాన్లో దశాబ్దాలుగా గబ్బిలాల్లోని రకరకాల కరోనా వైరస్‌ల గురించి అధ్యయనం చేస్తున్నదని వివరించారు.

ఎకోహెల్త్ అలయెన్స్‌లో 2014 నుంచి 2016 వరకు పని చేసిన హఫ్ ఈ స్వచ్ఛంద సంస్థ వుహాన్‌ ల్యాబ్‌తో సమన్వయంలో ఉండేదని పేర్కొన్నాడు. గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లు ఇతర జాతులపై దాడి చేయడానికి అవసరమైన అంశాలపై ఈ ల్యాబ్ కొన్ని సంవత్సరాల తరబడి అధ్యయనాలు చేస్తున్నదని హఫ్ తెలిపారు.

Also Read: చైనాలో మళ్ళీ లాక్‌డౌన్: నగరంలోని అక్కడి 35 లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం..

ప్రారంభమైన తొలి రోజు నుంచీ ఇది ఒక జెనెటికల్లీ ఇంజినీర్డ్ ఏజెంట్ అని చైనాకు తెలుసు అని ఆయన పేర్కొన్నారు. ఈ అతి భయంకరమైన బయోటెక్నాలజీని చైనా బదిలీ చేసి అమెరికా ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని అన్నారు. తాను అక్కడ విభ్రమకర విషయాలను చూశానని అన్నారు. ‘అసలు మనం ఒక బయోవెపన్ టెక్నాలజీని చైనాకు అందించాం’ అని ఆయన తెలిపారు.

click me!