గురుద్వారను సందర్శించిన బ్రిటన్ కింగ్ చార్లెస్ III .. గుడ్డుతో దాడి చేసిన వ్యక్తి అరెస్టు

By Rajesh KarampooriFirst Published Dec 7, 2022, 3:00 PM IST
Highlights

బ్రిట‌న్ కింగ్ చార్లెస్ (మూడ‌వ‌) ఇంగ్లండ్‌లోని లుట‌న్‌లో నూత‌నంగా నిర్మించిన గురుద్వార‌ను మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. గురునాన‌క్ గురుద్వార నిర్వహకులను, వాలంటీర్ల‌ను కింగ్ చార్లెస్ కలుసుకున్నారు. గురుద్వార‌ను సంద‌ర్శించిన స‌మ‌యంలో కింగ్ చార్లెస్ త‌ల‌కు క‌ర్చీఫ్ చుట్టుకుని క‌నిపించారు.

బ్రిటన్ కింగ్ చార్లెస్ III ఇంగ్లాండ్‌లోని లుటన్‌లో నూత‌నంగా నిర్మించిన గురుద్వారాను మంగ‌ళ‌వారం సందర్శించారు. ఈ సమయంలో ఆయన  గురుద్వారాను నిర్వహిస్తున్న లుటన్ సిక్కు సూప్ కిచెన్ వాలంటీర్లను కలుసుకున్నారు. ఆధ్యాత్మిక స్థలం(గురు ద్వారా) పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. గురుద్వారాను సందర్శించే సమయంలో కింగ్ చార్లెస్ తన తలకు కర్చీఫ్ కప్పుకుని కనిపించారు. అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. సిక్కు పాఠశాలను నిర్వహిస్తున్న స్థానిక సంఘాన్ని కూడా కలిశాడు. పంజాబీ సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటున్న పిల్లలతో బ్రిటిష్ చక్రవర్తి సంభాషించారు.

ఈ చిత్రాలను రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ ఇలా రాసుకొచ్చింది."నూతనంగా  నిర్మించిన గురునానక్ గురుద్వారాను బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III సందర్శించారు. అక్కడి నిర్వహుకులను, వాలంటీర్‌లను కలిశారు. వంటగది వారానికి 7 రోజులు, గురుద్వారాలో సంవత్సరంలో 365 రోజులు మంచి భోజనాన్ని అందిస్తుంది" అని పేర్కొంది. మహమ్మారి సమయంలో..  గురుద్వారా పాప్-అప్ కోవిడ్ వ్యాక్సిన్ క్లినిక్‌ను కూడా నిర్వహించింది. ఇది UKలో ఇదే మొదటిది. టీకా సంశయానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడానికి గురుద్వారా ఇతర ప్రార్థనా స్థలాలను ప్రోత్సహించింది."

PTI నివేదిక ప్రకారం.. గురుద్వారా లంగర్ లో రోజుకు 500 భోజనాలను అందిస్తున్నారు. గురుద్వారా నిర్మాణ పనులు 2020లో ప్రారంభమయ్యాయి. స్థానిక విరాళాల మద్దతుతో నిర్మించబడింది. మూడు అంతస్తుల్లో ఈ గురుద్వారాను నిర్మించారు.  బెడ్‌ఫోర్డ్‌షైర్‌లోని తూర్పు ఇంగ్లాండ్ ప్రాంతంలో రాజుగా కింగ్ ఛార్లెస్ మొదటి పర్యటన ఇది.   

చార్లెస్‌ కు అవమానం.. 

చార్లెస్ రాజు దేశానికి రాజు కావడం పట్ల కొందరు సంతోషిస్తే మరికొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచుగా అతను పర్యటనలో ఉన్నప్పుడు ప్రజలు తమ కోపాన్ని వ్యక్తం చేస్తారు. ఇటీవల చార్లెస్‌పై గుడ్డు విసిరిన వ్యక్తిని బెడ్‌ఫోర్డ్‌షైర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. లండన్‌కు ఉత్తరాన 45 కి.మీ దూరంలోని లూటన్‌లోని టౌన్ హాల్ పర్యటనలో స్థానికి ప్రజలను కలిసినప్పుడు చార్లెస్‌పై గుడ్డు విసిరారు. భద్రతా సిబ్బంది అతన్ని మరో చోటికి తీసుకెళ్లారు, అక్కడ అతను మళ్లీ ప్రజలతో కరచాలనం చేశాడు.
 

click me!