ఉత్తర కొరియా నుంచి టాయ్ లెట్ వెంట తెచ్చుకున్న కిమ్

First Published Jun 12, 2018, 10:52 AM IST
Highlights

సోషల్ మీడియాలో జోకులు

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ చాలా విలక్షణంగా ఉంటారు. ఆయన ఆలోచనలు కూడా విభిన్నంగా  ఉంటాయి. ఆయన ఎక్కువగా తాను చేసే పనుల ద్వారానే వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా ఆయన చేసిన మరోపని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో శిఖరాగ్ర చర్చలు జరిపేందుకు కిమ్ సింగపూర్ వచ్చిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి భేటీ పై ప్రపంచ దేశాలు దృష్టిసారిస్తున్నాయి. కాగా.. ఈ చర్చలకు వచ్చిన కిమ్.. తనతోపాటు టాయ్ లెట్ వెంట తెచ్చుకున్నారు. అది కిమ్‌ కోసం ప్రత్యేకంగా తయారుచేయించినది. అయితే మీడియా కథనాల ప్రకారం కిమ్‌ తన ఆరోగ్య రహస్యాలను పశ్చిమ దేశాలు కనిపెట్టకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు.

 ‘‘కిమ్‌ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థూలకాయుడైన ఆయనకు స్వతహాగా ఫాటీ లీవర్‌ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయి. తన మల, మూత్రాదులను పరీక్షించి పశ్చిమ దేశాలు తన ఆరోగ్య సమస్యను అంచనా వేస్తుందన్నది ఆయన భయం. దానికి తావు లేకుండా- ఎటువంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్‌ చేయగల అత్యాధునికమైన టాయ్‌లెట్‌ను తన కోసం ఆయన తయారు చేయించుకున్నారని దక్షిణ కొరియా వార్తాపత్రిక ఓ కథనంలో పేర్కొంది.

కాగా.. కిమ్.. అలా ప్రత్యేకంగా టాయ్ లెట్ ని వెంట తెచ్చుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కిమ్ ఫోటోని టాయ్ లెట్ తో కలిపి చిత్ర విత్రంగా ఫోటో షాప్ లో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 

click me!