నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్

Published : Feb 25, 2024, 10:19 AM ISTUpdated : Feb 25, 2024, 10:28 AM IST
నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్

సారాంశం

నడిరోడ్డుపై  ఓ వ్యక్తి మహిళను వేధించారు. అయితే  అతనికి  దారిపోయేవారు బుద్ది చెప్పారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూఢిల్లీ:చర్యకు ప్రతి చర్య ఉంటుందని మనం తరచుగా వినే ఉంటాం.  అయితే  ఓ మహిళను నడిరోడ్డుపై వేధింపులకు గురిచేసిన వ్యక్తిని రోడ్డున వెళ్లే ప్రయాణీకులు చితకబాదారు. ఈ ఘటనను కొందరు  వీడియో రికార్డ్ చేసి  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

also read:ఇన్సూరెన్స్ డబ్బుల కోసం: అమ్మమ్మను మనవడు ఏం చేశాడంటే?

 

ఓ మహిళ ఒంటరిగా వీధిలో వెళ్తున్న సమయంలో  ఓ వ్యక్తి ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. ఆ వ్యక్తి నుండి తప్పించుకొనేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తుంది.  అయితే అదే సమయంలో  ఓ బస్సు అదే దారి గుండా వెళ్తుంది.

also read:బుల్లెట్‌ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?

ఈ బస్సులోని ప్రయాణీకులు  ఈ విషయాన్ని గమనించి  నిందితుడికి దేహశుద్ది చేశారు.  బస్సులోని ప్రయాణీకుల సహయంతో  బాధితురాలు అక్కడి నుండి సురక్షితంగా బయటపడింది.

 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళలను వేధించిన వ్యక్తికి దేహశుద్ది చేయడాన్ని సమర్ధించారు.  ఒక చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని  ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.గుర్తు తెలియని మహిళను రక్షించేందుకు ప్రయాణీకులు రావడాన్ని  కొందరు నెటిజన్లు  సంతోషం వ్యక్తం చేశారు. మహిళను కాపాడేందుకు వచ్చిన  వారిని  అభినందించారు.  మహిళను వేధించిన వ్యక్తికి మంచి గుణపాఠం చెప్పారని మరొకరు వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?