ఇలా కూడా ఓట్లు అడుక్కుంటారా..?

First Published 4, Jul 2018, 10:50 AM IST
Highlights


వింతగా ఎన్నికల ప్రచారం.. ఫోటోలు వైరల్

ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.. రాజకీయ నాయకుల నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అని నిత్యం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక కొందరైతే ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చు చేయాలో ప్రణాళికలు రచిస్తుంటారు. మరికొందరైతే ఎంత భిన్నంగా ప్రచారం చేసి ప్రజల మనసు గెలుచుకోవాలని చూస్తుంటారు. ఇలానే ఓ రాజకీయ నాయకుడు చేసిన విభిన్న ఎన్నికల ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మరికొద్ది రోజుల్లో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. అయాజ్ మెమాన్ మోటీవాలా అనే రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. కాకపోతే అందరికన్నా భిన్నంగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో.. ఇప్పుడు అతని ప్రచారం ఫోటోలు ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి.

ఇంతకీ అతను ప్రచారం ఎలా చేశాడో తెలుసా..? చెత్తకుప్ప మీద కూర్చొని, మురికి నీటిలో కూర్చొని వచ్చే పోయే ప్రజలను ఓట్లు అడిగాడు. అంతేకాదు మురికి నీటిని తాగుతూ ఫేస్ బుక్ లో లైవ్ కూడా ఇచ్చాడు. ఆయన ఒక్కో ఫోటోకి 1800లకు పైగా లైక్ లు రావడం గమనార్హం.

Last Updated 4, Jul 2018, 10:50 AM IST