
మన పక్కన చిన్న అగ్నిప్రమాదం జరిగితేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుతాం.. అలాంటిది ఒకేసారి 50 కార్లు తగలబడి అక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అటువంటి ప్రమాదం లాగోస్‌లో జరిగింది. లాగోస్-ఇబాదాన్ ఎక్స్‌ప్రెస్‌వే పై ఓట్‌డోలా వంతెనపై ఓ పెట్రోల్ ట్యాంకర్ ఇంధనాన్ని నింపుతున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో అటుగా వెళ్తొన్న కార్లు అగ్నికి బూడిదయ్యాయి. ప్రాథమికంగా సుమారు 50 కార్లు దగ్థమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడున్న వారు కార్లను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.