నువ్వూ కూడ అధ్యక్షురాలివి కావొచ్చు: మేన కోడలితో కమలా హరీస్

By narsimha lodeFirst Published Nov 6, 2020, 5:01 PM IST
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న కమలా హరీస్ తన మేనకోడలితో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 


వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న కమలా హరీస్ తన మేనకోడలితో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్నికల కౌంటింగ్ సాగుతున్న సమయంలో తీరిక సమయంలో మేనకోడలితో కమలా హరీస్ సంభాషించారు. మేనకోడలిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడారు.  నాలుగేళ్ల అమరా అజాగు తనకు అధ్యక్షురాలు కావాలని ఉందని కమలా హరీస్ తో చెప్పారు. 

“You could be president.” pic.twitter.com/akB2Zia2W7

— Meena Harris (@meenaharris)

also read:ఓట్ల లెక్కింపు సాగుతుంది, ఓపికగా ఉండండి: గెలుపుపై బైడెన్ ధీమా

కష్టపడితే నువ్వూ కూడా అధ్యక్షురాలివి కావచ్చని చెప్పారు. అయితే నీకు 35 ఏళ్లు రావాలని ఆమె చెప్పారు. అజాగు తల్లి  ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 24 గంటల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేశారు. 

 

చిన్నారిలో కమలా హరీస్ స్పూర్తిని నింపారని పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు. డెమోక్రటిక్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉంది. ఇప్పటికే బైడెన్ కి 264 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. ట్రంప్‌నకు 214 మాత్రమే వచ్చాయి. ఇప్పటికే  ఈ వీడియో 4.5 లక్షల మంది చూశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జో బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

click me!