కాబూల్ లో ఆత్మాహుతి దాడి: 14 మంది దుర్మరణం

Published : Jun 04, 2018, 04:36 PM IST
కాబూల్ లో ఆత్మాహుతి దాడి: 14 మంది దుర్మరణం

సారాంశం

అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుళ్లతో దద్ధరిల్లింది.

కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుళ్లతో దద్ధరిల్లింది. ముస్లిం మత పెద్దల సమావేశం వద్ద మోటార్ సైకిల్ పై వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 14 మంది మరణించారు. 

కాబూల్ పశ్చిమ ప్రాంతంలోని నివాస భవనాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్ ప్రవేశ ద్వారం వద్ద బాంబు పేలింది. చాలా మంది మతపెద్దలు వెళ్లిపోయిన తర్వాత ఈ పేలుడు సంభవించింది. 

తమ కుటుంబ సభ్యులతో అక్కడ గుమిగూడిన మహిళలు పెద్ద పెట్టున కేకలు వేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనేది వెంటనే తెలియలేదు.

PREV
click me!

Recommended Stories

Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..