పాపం... లైవ్ లో ఈగను మింగేసిన జర్నలిస్ట్... వీడియో వైరల్..!

Published : Sep 03, 2022, 09:50 AM IST
 పాపం... లైవ్ లో ఈగను మింగేసిన జర్నలిస్ట్... వీడియో వైరల్..!

సారాంశం

న్యూస్ చెప్పడం మాత్రం ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియోని సదరు జర్నలిస్టే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

జర్నలిస్ట్ లో ఏదైనా అత్యవసర వార్తలు తెలియజేసే సమయంలో లైవ్ లో మాట్లాడుతూ ఉంటారు. ఓ జర్నలిస్ట్ కూడా అదేవిధంగా లైవ్ లో మాట్లాడాల్సి వచ్చింది. అయితే.. ఆ సమయంలో ఆమె నోట్లోకి ఓ ఈగ దూరింది. ఆ  సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కుదరదు. దీంతో.. ఆమె ఏకంగా ఆ ఈగను మింగేసింది. న్యూస్ చెప్పడం మాత్రం ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియోని సదరు జర్నలిస్టే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే...

 

పాకిస్తాన్ లో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. ఈ భారీ వర్షాలకు అక్కడి ప్రజలు ఎంత అవస్త పడుతున్నారో.. వరదలు ఎలా ముంచెత్తుతున్నాయో జర్నలిస్ట్ ఫరా నాసర్  ఆ వీడియోలో వివరిస్తున్నారు.  అంత సీరియస్ గా ఆమె పరిస్థితిని వివరిస్తున్న క్రమంలో ఈగ నోట్లోకి దూరడం గమనార్హం. లైవ్ కాకుంటే ఆమె ఆ సందర్భంలో బ్రేక్ తీసుకొని ఉండేవారు. కానీ.. అది లైవ్ కావడం, అందులోనూ సీరియస్ విషయం కావడంతో.. ఆమె తన వార్తలకు ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా.. వార్తలను కంటిన్యూ చేశారు.  దీనిని ఆమె చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఆ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో... అది వైరల్ గా మారింది. అయితే.... ఆమె డెడికేషన్ నెటిజన్లకు విపరీతంగా నచ్చింది. వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. ఆ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఆమె కెనడాకు చెందిన జర్నలిస్ట్ కావడం గమనార్హం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?