
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా సైతం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకుంటూ... తనపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యాలో కార్యకలాపాలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తోంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. సైన్య రహితంగా చేసేంత వరకు ఈ దాడి కొనసాగుతుందని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భద్రత, ఆర్థిక సాయం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చర్చించారు. ఫోన్ లో మాట్లాడుకున్న ఇరువురు నేతలు.. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం, రష్యాపై ఆంక్షల కొనసాగింపు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిపారు. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేయాలన్న ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ మరియు టెక్నాలజీ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డ్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వాగతించారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. "అధ్యక్షుడు బిడెన్ తన పరిపాలన ఉక్రెయిన్‌కు భద్రత, మానవతా మరియు ఆర్థిక సహాయాన్ని పెంచుతోందని మరియు అదనపు నిధులను పొందేందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు" వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూక్లియర్ రియాక్టర్లను సురక్షితమైన స్థితిలో ఉంచిన ఉక్రేనియన్ ఆపరేషన్ నైపుణ్యం మరియు ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ఉక్రేనియన్ అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి గురించి US అధ్యక్షుడు బైడెన్ ఆందోళనను పునరుద్ఘాటించారు. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని శిక్షణా భవనంలో శుక్రవారం తెల్లవారుజామున షెల్స్ తాకిడితో మంటలు చెలరేగాయి. అయితే, యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.
ప్రపంచం గత రాత్రి అణు విపత్తును తృటిలో తప్పించింది అని ఐక్యరాజ్యసమితిలో యుఎస్ రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ భద్రతా మండలి అత్యవసర సమావేశంలో చెప్పారు. "గత రాత్రి రష్యా దాడి యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ను తీవ్ర ప్రమాదంలో పడేసింది. ఇది చాలా నిర్లక్ష్యంగా మరియు ప్రమాదకరంగా ఉంది. ఇది రష్యా, ఉక్రెయిన్ మరియు ఐరోపా అంతటా పౌరుల భద్రతకు ముప్పు తెచ్చింది" అని థామస్-గ్రీన్‌ఫీల్డ్ చెప్పారు.