Russia Ukraine Crisis : మ‌రోమారు చర్చ‌ల‌కు ఉక్రెయిన్ సై.. మూడో రౌండ్ చర్చ‌లు ఎప్పుడంటే.. ?

Published : Mar 06, 2022, 06:24 AM IST
Russia Ukraine Crisis : మ‌రోమారు చర్చ‌ల‌కు ఉక్రెయిన్ సై.. మూడో రౌండ్ చర్చ‌లు ఎప్పుడంటే.. ?

సారాంశం

Russia Ukraine Crisis : ఉక్రెయిన్‌- రష్యా మ‌ధ్య తలెత్తిన రక్తపాత సంఘర్షణకు ముగింపు పలికేందుకు మాస్కో,  కైవ్ మధ్య చర్చలు సోమవారం తిరిగి ప్రారంభమవుతాయని ఉక్రెయిన్ సంధానకర్త డేవిడ్ అరాఖమియా శనివారం తెలిపారు. అరాఖమియా తన ఫేస్‌బుక్ పేజీలో "మూడో రౌండ్ చర్చలు సోమవారం జరుగుతాయి" అని తెలిపారు. డేవిడ్ అరాఖమియా.. అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పార్టీ పార్లమెంటరీ నాయకుడు,  శాంతి చర్చలకు ప్రతినిధి.   

Russia Ukraine Crisis : రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్దం పదో రోజుకు చేరుకుంది. రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని పలు న‌గరాల‌ను ఆక్ర‌మించిన ర‌ష్యా.. శ‌నివారం కూడా  ఉక్రెయిన్ లోని పలు న‌గ‌రాల‌పై  బాంబుల దాడిచేసింది. ఉక్రెయిన్ ను ధ్వంసం చేయాల‌నే దుర్దేశ్యంతో దారుణాల‌కు పాల్ప‌డుతుంది. యుద్ధం మొదట్లో కేవలం మిలటరీ పోస్ట్ లపైనే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నప్పటికీ… ప్రస్తుతం జనావాసాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ లపై కూడా దాడులు చేస్తోంది. 

ఇదిలా ఉంటే..ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల తలెత్తిన రక్తపాత సంఘర్షణకు ముగింపు పలికేందుకు మాస్కో,  కైవ్ మధ్య చర్చలు సోమవారం తిరిగి ప్రారంభమవుతాయని ఉక్రెయిన్ సంధానకర్త డేవిడ్ అరాఖమియా శనివారం తెలిపారు. అరాఖమియా తన ఫేస్‌బుక్ పేజీలో "మూడో రౌండ్ చర్చలు సోమవారం జరుగుతాయి" అని తెలిపారు. డేవిడ్ అరాఖమియా.. అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పార్టీ పార్లమెంటరీ నాయకుడు,  శాంతి చర్చలకు ప్రతినిధి. 

అలాగే...  ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ద ప్ర‌భావం ర‌ష్యాను అర్థ‌మ‌యింద‌నీ, ఉక్రెయిన్ ప్రతిఘటన, అంతర్జాతీయ ఆంక్షల పట్ల ర‌ష్యాను త‌న వైఖ‌రి ఏంటో త‌న‌కు అర్థ‌మైంద‌ని అన్నారు. యుద్ధం ప్రారంభంలో.. వారు పూర్తి ఆధిపత్యం క‌న‌బ‌రిచారు. ఉక్రెయిన్ ప్ర‌తిఘ‌టించ‌క‌..  ఇంతలా ప్రతిఘటిస్తుంద‌ని వారికి తొలుత అర్థం కాలేదు .. ఇలా జ‌రుగుతంద‌ని ఊహించ‌లేదని పొడోల్యాక్ కెనడియన్ దినపత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్‌కి ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో చెప్పారు.  

బెలారస్ సరిహద్దులో జరిగిన రష్యా  ఉక్రెయిన్ మధ్య మొదటి రెండు రౌండ్ల చర్చల వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం లేకున్నా..  ఈ సారి చ‌ర్య‌లు ఆశ‌జ‌న‌కంగా ఉంటాయ‌ని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ప్రకారం, చర్చల మూడవ సెషన్ సోమవారం జరగనుందని తెలిపారు.

రష్యన్ బ‌లగాల ప‌రిస్థితి రోజురోజూకు దారుణంగా మారుతోంద‌నీ, తొలుత‌ పెద్ద మొత్తంలో ఆయుధ సంప‌త్తి ఉన్నా.. క్ర‌మంగా అవి త‌గ్గుతూ వ‌చ్చాయ‌ని, పెద్ద మొత్తంలో సైన్యాన్ని కూడా కోల్పోయార‌ని తెలిపారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ర‌ష్యా మీద‌ ఆంక్షలు విధించార‌నీ, దీంతో ర‌ష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంద‌నీ, దేశం చట్టవిరుద్ధంగా మారిందనీ, వారి ప్రచారం అస్సలు పనిచేయద‌ని  పోడోల్యాక్ చెప్పారు. ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను విధించాలని NATO కోసం అధ్యక్షుడి అభ్యర్థనను పోడోల్యాక్ కూడా మ‌రోసారి  పునరావృతం చేశాడు. త‌మ దేశాన్ని  నో-ఫ్లై జోన్‌ను ప్ర‌క‌టించాల‌ని తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే