
Russia Ukraine Crisis : ఉక్రెయిన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మారణ హోమం సృష్టించారు. గత పదో రోజులుగా.. ఉక్రెయిన్ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. రష్యా పలు నగరాలపై బాంబుల దాడి చేసింది. ఉక్రెయిన్ ను ధ్వంసం చేయాలనే దుర్దేశ్యంతో దారుణాలకు పాల్పడుతుంది. యుద్ధం మొదట్లో కేవలం మిలటరీ పోస్ట్ లపైనే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నప్పటికీ… ప్రస్తుతం జనావాసాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ లపై కూడా దాడులు చేస్తోంది. అంతర్జాతీయంగా దోహిగా నిలిచింది రష్యా. అయితే.. ఈ యుద్ధాన్ని ఖండిస్తూ.. ప్రపంచ దేశాలు.. ఉక్రెయిన్ కి మద్దతుగా నిలిచారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్‌కీ.. ఏదైనా తన దేశం తర్వాతే అంటూ సైనికుల్లో స్ఫూర్తిని రగిలిస్తుంటే.. ఆయన వెనుదన్నుగా నిలుస్తోంది ఉక్రెయిన్ ప్రథమ మహిళ, ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్‌కీ భార్య ఒలెనా జెలెన్స్‌కా. సోషల్ మీడియా వేదికగా.. ప్రజల్లో మనోధైర్యం నింపుతోంది.
ఒలెనా జెలెన్స్‌కా టెలిగ్రామ్ ఛానెల్‌ని ప్రారంభించింది. అందులో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుతూ.. వారిలో స్పూర్తినింపుతోంది. యుద్ధ సమయంలో ఎలా ఉండాలి? ఎలా జీవించాలి ? మాట్లాడుతూ.. దేశ పౌరుల్లో మనోదైర్యాన్ని నింపుతోంది. పలు వీడియో సందేశాలను పంచుకుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశంలో.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఉక్రెయిన్‌కు ఎలా సహాయం చేస్తారో తనను అడుగుతున్నారని చెప్పారు. ఆమె సమాధానంగా.. ప్రపంచానికి నిజం చెప్పండి! ఈ యుద్దం గురించి మాట్లాడండి! ఉక్రెయిన్‌లో జరుగుతున్నది పుతిన్ చెప్పినట్లు 'స్పెషల్ మిలిటరీ ఆపరేషన్' కాదు, ఇది పూర్తి స్థాయి యుద్ధం, ఇక్కడ దురాక్రమణదారు రష్యన్ ఫెడరేషన్ అని చెప్పుకోచ్చింది. గత పదిరోజులుగా రష్యా దాష్టీకానికి ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. రష్యా దాడుల్లో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అమాయకులు నలిగిపోతున్నారు.ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాలని అభ్యర్థించారు. అలాగే ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రష్యా చెప్పినట్లుగా ఉక్రెయిన్‌లో జరిగేది సైనిక చర్య కాదు. యుద్ధమిది. దీని గురించి మాట్లాడండి. ఉక్రెయిన్ పౌరులు, చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యకు దూరమవుతున్న వారి పరిస్థితి గురించి ప్రపంచానికి చెప్పండి. ఉక్రెయిన్‌ను ధ్వంసం చేసే క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనీ రష్యన్ తల్లులకు వినిపించేలా చెప్పండి.ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. తనను తాను రక్షించుకోవాలని భావిస్తుంది. ఉక్రెయిన్‌ను రక్షించాల్సిన పనిలేదు. కానీ, మా ప్రజలు, సైనికులకు ఈ ప్రపంచ దేశాల కావాలి ' అంటూ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
ఒలెనా వోలోడిమిరివ్నా జెలెన్ స్కా వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్, రచయిత. 2019లో, ఫోకస్ మ్యాగజైన్ ద్వారా అత్యంత ప్రభావవంతమైన 100 మంది ఉక్రెయిన్ల జాబితాలో జెలెన్ స్కా 30వ స్థానంలో నిలిచారు. 2003లో ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీను వివాహం చేసుకుంది.