ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆకస్మిక పర్యటన.. వివరాలు ఇవే..

Published : Feb 20, 2023, 04:20 PM IST
ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆకస్మిక పర్యటన.. వివరాలు ఇవే..

సారాంశం

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం ఉక్రెయిన్‌‌ రాజధాని కైవ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్దం మొదలైన తర్వాత అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్.. ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం ఉక్రెయిన్‌‌ రాజధాని కైవ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్దం మొదలైన తర్వాత అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్.. ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్దం మొదలైన ఫిబ్రవరి 24తో ఏడాది పూర్తికావస్తున్న వేళ.. జో బైడెన్ కైవ్‌లో పర్యటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీని కలవనున్నట్టుగా జో బైడెన్ చెప్పారు. ‘‘మేము ఉక్రెయిన్‌పై రష్యా క్రూరమైన దండయాత్ర వార్షికోత్సవాన్ని సమీపిస్తున్నందున.. అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలవడానికి, ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల మా అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి నేను ఈ రోజు కైవ్‌లో ఉన్నాను’’ అని బైడెన్ చెప్పారు.

అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ‘‘దాదాపు ఒక సంవత్సరం క్రితం పుతిన్ తన దండయాత్రను ప్రారంభించినప్పుడు.. ఉక్రెయిన్ బలహీనంగా ఉందని, పశ్చిమ దేశాలు విభజించబడిందని భావించాడు. అతను మమ్మల్ని అధిగమించగవచ్చని అనుకున్నాడు. కానీ ఆయనది  పూర్తిగా తప్పుడు అభిప్రాయం’’ అని జో బైడెన్ పేర్కొన్నారు. 

‘‘గత సంవత్సరం కాలంగా అపూర్వమైన సైనిక, ఆర్థిక, మానవతా మద్దతుతో ఉక్రెయిన్‌ను రక్షించడంలో సహాయపడటానికి అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వరకు దేశాల కూటమిని యునైటెడ్ స్టేట్స్ నిర్మించింది. ఆ మద్దతు కొనసాగుతుంది’’ అని బైడెన్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే