కదులుతున్న కారులో అమ్మమ్మపై కాల్పులు జరిపిన ఆరేళ్ల చిన్నారి... ఇంతకీ ఏమైందంటే..

Published : Feb 18, 2023, 01:57 PM IST
కదులుతున్న కారులో అమ్మమ్మపై కాల్పులు జరిపిన ఆరేళ్ల చిన్నారి... ఇంతకీ ఏమైందంటే..

సారాంశం

కారు వెనక సీటులో కూర్చున్న ఓ ఆరేళ్ల చిన్నారి తన అమ్మమ్మ మీద కాల్పులు జరిపింది. తుపాకీ పేలడంతో ఓ బుల్లెట్ ఆమె తుంటిలోకి చొచ్చుకుపోయింది. 

ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫాక్స్ న్యూస్‌ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 16న అమెరికాలోని ఫ్లోరిడాలో కదులుతున్న కారు వెనుక సీటులో నుండి ఆరేళ్ల బాలిక తన అమ్మమ్మను కాల్చింది.

ఈ మేరకు నార్త్ పోర్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం, కారు వెనుక సీటులో ఉన్న ఆ ఆరేళ్ల చిన్నారికి తన 57 ఏళ్ల అమ్మమ్మ తుపాకీ దొరికింది. దానిని ఆపరేట్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ ఓ బుల్లెట్ పేలింది. ఈ ఘటన మధ్యాహ్నం 3 గం.ల సమయంలో జరిగింది. 

తుపాకీ పేలడంతో ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అమ్మమ్మకు నడుము కిందిభాగంలో బుల్లెట్ చొచ్చుకుపోయింది. ఈ ఆయుధం వాస్తవానికి హోల్‌స్టర్‌లో ఉంది.  "డ్రైవర్ సీటు వెనుక జేబులో, సీటు కవర్ కింద ఉంచబడింది" అని పోలీసు శాఖ పేర్కొంది.

కరాచీలో పోలీస్ చీఫ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి.. ఐదుగురు పాక్ తాలిబన్ ఉగ్రవాదులు హతం.. మరో నలుగురు మృతి..

అది ఎలాగే చిన్నారి తీసింది. దానితో ఆడుకోబోయి ప్రమాదవశాత్తు పేల్చడంతో అమ్మమ్మకు గాయం అయ్యింది. అయితే, బుల్లెట్ తగిలిన తరువాత కూడా ఆమె కారును ఇంటివరకు డ్రైవ్ చేయగలిగింది. ఇంటికి చేరుకున్న వెంటనే యూఎస్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 911కి కాల్ చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న సహాయసిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు తగిలిన బుల్లెట్ తో పెద్ద ప్రమాదమేమీ జరగలేదని.. చిన్న గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామని, బాలికను కూడా ప్రశ్నించామని నార్త్ పోర్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. "నార్త్ పోర్ట్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్‌ వారు ఆ చిన్నారిని ప్రశ్నించారు. ఈ రెస్క్యూలో పాల్గొన్న అన్ని ఇతర పార్టీలను కూడా ప్రశ్నించారు" అని వారు పత్రికా ప్రకటనలో తెలిపారు.

పోలీసు చీఫ్ టాడ్ గారిసన్ దీనిమీద ఒక ప్రకటన విడుదల చేస్తూ, "తుపాకీ భద్రత ప్రాముఖ్యత విషయానికి సంబంధించిన ఇది చాలా భయంకరమైన ఉదాహరణ" అని అన్నారు. ఈ ఘటనలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఈ సంఘటన వల్ల అమ్మమ్మ మానసిక ఆందోళనలో పడుతుంది. చిన్నారి మీద పడే ప్రభావం కూడా ఘోరంగా ఉండే అవకాశం ఉంది.. అని అన్నారు. 

"దయచేసి పిల్లలు తుపాకీలను ఉపయోగించకుండా తగిన చర్యలు తీసుకోండి" అని అభ్యర్థించారు. కాల్పులు జరిపిన ఆరేళ్ల చిన్నారితో పాటు..ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత.. కాల్పులు "యాక్సిడెంటల్" అని పోలీసులు గుర్తించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే