ఆకాశంలో ఓ విమానంలో ఉన్నట్టుండి మంటలు పుట్టాయి. ఆ విమానం అదుపుతప్పి సమీపంలోని మరో విమానాన్ని ఢీకొట్టడానికి వెళ్లింది. మరో విమానాన్ని ఢీకొట్టడానికి కొన్ని క్షణాలకు ముందే ప్యాసింజర్ల స్కైడైవ్ చేశారు. స్కైడైవ్ సూట్‌కు అమర్చిన కెమెరా రికార్డ్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ప్రయాణికుడు భూమికి చేరుతుండగా ఆ విమానం మరోదాన్ని ఢీకొట్టిన భయానక దృశ్యం కనిపించింది.
న్యూఢిల్లీ: ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో ఉన్నట్టుండి మంటలు రేగాయి. దాని ప్రయాణం అదుపుతప్పింది. గాలిలో గింగిరాలు పోతున్నది. సమీపంలో ఎగురుతున్న మరో విమానానికి సమీపించింది. దాన్ని ఢీకొట్టడానికి క్షణాల ముందే ప్యాసింజర్లందరూ స్కైడైవ్ చేశారు. ప్యారాచూట్ల సహాయంతో నేలకు దిగారు. ఈ ఘటనను ఆసాంతం స్కైడైవ్ చేసిన ప్యాసింజర్ సూట్‌కు ఉన్న కెమెరా రికార్డ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ఊపిరి బిగపట్టేలా చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లూ షాక్ అవుతున్నారు.
THIS SOME OF THE WILDEST SH*T EVER CAUGHT ON CAMERA 😳😳 pic.twitter.com/IpBo1VAXKD
— Theory🥴 (@Idontknowyoucuh)తమ విమానం మరోదానితో ఢీకొట్టడానికి క్షణాల ముందే ప్యాసింజర్లు స్కైడైవ్ చేశారు. ఈ ఘటన 2013లో చోటుచేసుకున్నట్టు తెలిసింది. అయితే, అదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదు. అమెరికాలోని విస్కాన్సిన్లో లేక్ సుపీరియర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు విమానాలు ఢీకొట్టిన ఘటనలో ఒకటి క్రాష్ అయి నేలపై కుప్పకూలింది. మరో విమానం సేఫ్‌గా ల్యాండ్ కాగలిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులూ సురక్షితంగా నేలదిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదో వీడియో గేమ్‌ను తలపిస్తున్నదని కొందరు, భయానకంగా ఉన్నదని ఇంకొందరు ట్వీట్లు చేశారు.