కరోనా వ్యాక్సినేషన్: కేరళ సర్కార్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published May 25, 2021, 4:59 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ విషయంలో  కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. విదేశాల్లో విద్య, ఉద్యోగం కోసం వెళ్లాలనుకొనేవారికి టీకా వేయడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది.

తిరువనంతపురం: కరోనా వ్యాక్సిన్ విషయంలో  కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. విదేశాల్లో విద్య, ఉద్యోగం కోసం వెళ్లాలనుకొనేవారికి టీకా వేయడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది.18 ఏళ్ల నుండి 45 ఏళ్ల వయస్సున్నవారు విదేశాల్లో విద్య, ఉద్యోగం కోసం వెళ్లాలనుకోవాలనుకొంటే వారికి వ్యాక్సిన్ విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది కేరళ సర్కార్.

వ్యాక్సిన్ వేసుకొన్నవారికే తమ దేశంలోకి అనుమతిస్తామని చాలా దేశాలు ప్రకటించాయి ఈ తరుణంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రిగా వీణా జార్జి ఇటీవలనే  ప్రమాణం చేశారు.10 కేటగిరీలకు చెందినవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది కేరళ ప్రభుత్వం.

పరీక్షల వాల్యుయేషన్ కు హాజరయ్యే ఉపాధ్యాయులతో పాటు ఆహార, పౌరసరఫరాల శాఖ, పోస్టల్ , సామాజిక న్యాయం, మహిళా, శిశు సంక్షేమం, మత్స్యకారశాఖతో పాటు  పలు ప్రభుత్వ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిని ఈ గ్రూపులో చేర్చారు. రాష్ట్ర స్థాయి కమిటీ సూచనల ఆధారంగా కొత్తగా 11 కేటగిరీల్లోని వారికి కరోనా వ్యాక్సినేషన్ విషయంలో  ప్రాధాన్యత ఇవ్వనున్నామని మంత్రి చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుండి వీరందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. 


 

click me!