చపాతీలు చేసిన బ్రిటన్ రాకుమారుడు..!

Published : May 25, 2021, 02:47 PM IST
చపాతీలు చేసిన బ్రిటన్ రాకుమారుడు..!

సారాంశం

వారు చపాతీలు చేస్తున్న ఫోటోలను ‘ ద డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్స్’ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో.. ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి


బ్రిటన్ రాకుమారుడు విలియమ్, అతని భార్య కేట్ మిడెల్టన్ చపాతీలు తయారు చేశారు. అంతేకాదు.. ఆ చపాతీల్లోకి కూర కూడా స్వయంగా వారే వండటం విశేషం. సిక్కు మహిళల సహాయంతో వారు వాటిని స్వయంగా తయారు చేశారు.


సిక్కు సంజోగ్ సమూహం.. ఎడిన్బర్గ్ లోని పేదలకు ఆహారం అందించేందుకు చపాతీలు తయారు చేస్తున్నారు. కాగా.. వారితోపాటు ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ కూడా చేతులు కలిపారు. ఎడిన్బర్గోలోని క్వీన్ నివాసానికి సమీపంలో ఉన్న కిచెన్ లో ఈ సిక్కు సంజోగ్ గ్యాంగ్.. ఆహారం తయారు చేస్తుండగా.. వీరిద్దరు కూడా వారితో పాటు చేతులు కలిపారు. చపాతీలు, కూర చేయడంలో సహాయం చేశారు.

వారు చపాతీలు చేస్తున్న ఫోటోలను ‘ ద డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్స్’ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో.. ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. రాజకుటుంబానికి చెందిన వారు ఎలాంటి అహంకారం లేకుండా.. సామాన్యుల కోసం భోజనం తయారు చేయడం చాలా గొప్ప విషయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

కాగా.. ఈ చపాతీలు తయారు చేసే సమయంలో.. రాజకుమారుడు విలియమ్, ఆయన భార్య కేట్.. ఆ సిక్కు మహిళలతో సరదాగా మాట్లాడినట్లు సమాచారం. తన కన్నా తన భార్య కేట్ ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటున్నారంటూ ఆయన వారితో చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే