తెగిపడిన కేబుల్ కారు... 13మంది దుర్మరణం..!

By telugu news teamFirst Published May 24, 2021, 12:37 PM IST
Highlights

మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్ పర్వతం పైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు.
 

ఇటలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కేబుల్ కారు.. ప్రమాదవశాత్తు తెగి కిందపడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 13మంది దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఉత్తర ఇటలీలో  చోటుచేసుకుంది. 13మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 

ఎత్తైన ప్రదేశాలను  చూసేందుకు పర్యాటక ప్రాంతాల్లో కేబుల్ కార్లు ఏర్పాటు  చేస్తారనే విషయం మనకు తెలిసిందే. మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్ పర్వతం పైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు.

మరో 100 మీటర్లు వెళితే పర్వత శిఖరంపై దిగుతారనగా... ఒక్కసారిగా కేబుల్‌ తెగిపోయింది. 15 మంది ప్రయాణికులు కూర్చున్న కేబుల్‌ కారు అమాంతం కిందపడిపోయి పల్టీలు కొడుతూ చెట్లను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు దూరంగా విసిరేసినట్లుగా పడిపోయారు. 

2016లోనే ఈ కేబుల్‌ లైన్‌ను పునర్నిర్మించారని స్టెసా మేయర్‌ మార్సెల్లా సెవెరినో తెలిపారు. కరోనా కారణంగా మూతబడిన ఈ పర్యాటక ప్రదేశాన్ని ఇటీవలే తెరిచారని వెల్లడించారు. 1998 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని మీడియా తెలిపింది.  

click me!