జపాన్ మాజీ ప్రధాని షింజే మృతి: అబేపై కాల్పులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Published : Jul 08, 2022, 09:38 AM ISTUpdated : Jul 08, 2022, 10:11 AM IST
 జపాన్ మాజీ ప్రధాని షింజే మృతి: అబేపై కాల్పులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

సారాంశం

జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మృతి చెందాడు. షింజేపై దుండగుడు కాల్పులకు దిగాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ షింజే మరణించాడు.

టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మృతి చెందాడు.  షింజే అబేపై దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే అతడిని  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జపాన్ మాజీ ప్రధాని షింజే మృతి చెందినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. 

నారా సిటీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో షింజే అబే ప్రసంగిస్తున్న సమయంలో వెనుకనుండి ఓ దుండగుడు కాల్పులు జరిపాడని స్థానిక మీడియా తెలిపింది.  మాజీ ప్రధాని షింజే అబేపై కాల్పులకు దిగిన దుండగుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని మీడియా వివరించింది.  ఆదివారం నాడు జపాన్ లో ఎగువ సభ ఎన్నికలను పురస్కరించుకొని స్టంప్ ప్రసంగం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్టుగా క్యోడో వార్తా సంస్థ తెలిపింది.

 జపాన్ మాజీ ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో వెనుక నుండి వచ్చిన వ్యక్తి కాల్పులకు దిగినట్టుగా ప్రత్యక్షసాక్షి తెలిపాడని ఎన్‌హెచ్ కె మీడియా సంస్థ తెలిపింది. అతి సమీపం నుండి దుండగుడు మాజీ ప్రధానిపై కాల్పులకు దిగాడు. మొదటి సారి కాల్పుల శబ్బం వచ్చింది. తెరుకొనేలోపుగానే రెండోసారి కూడా కాల్పుల శభ్దంతో పాటు పొగ కూడా వచ్చిందని ప్రత్యక్ష సాక్షి మీడియాకు వివరించారు.

రెండోసారి తుపాకీతో కాల్చిన తర్వాత అబే ప్రసంగం వినడానికి వచ్చిన వారంతా మాజీ ప్రధానికి సపర్యలు చేశారు.  దుండగుడి కాల్పులతో షింజే శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. మెడ నుండి రక్తం ధారగా పోయిందని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వివరించారు.

షింజే అబేను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. షింజే పై షాట్ వెపన్ తో దుండగుడు కాల్పులకు దిగినట్టుగా స్థానిక మీడియ సంస్థలు నివేదించాయి.ఈ ఘటన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

జపాన్ లో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు షింజోది. 2006 లో ఏడాది పాటు అబే ఏడాది పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2012 నుండి 2020 వరకు కూడా ఆయన ఈ పదవిలో ఉన్నారు.జపాన్ లో అత్యంత తుపాకీ నియంత్రణ చట్టాలున్నాయి. జపాన్ లో తుపాకీ లైసెన్స్ పొందాలంటే అంత సులభం కాదు. తొలుత షూటింగ్ అసోసియేషన్ నుండి సిఫారసును పొందాలి. ఆ తర్వాత  పోలీసులు కఠినమైన నిబంధనలను దాటుకొని తుపాకీ లైసెన్స్ ను పొందుతారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !