తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ పారిపోవడానికి వాడిన కారును తవ్వి తీసిన తాలిబాన్లు

Published : Jul 07, 2022, 08:58 PM IST
తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ పారిపోవడానికి వాడిన కారును తవ్వి తీసిన తాలిబాన్లు

సారాంశం

తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్.. అమెరికా దాడుల నుంచి తప్పించుకోవడానికి వినియోగించిన కారును తాజాగా తాలిబాన్లు వెలికి తీశారు. ముల్లా ఒమర్ మరణించిన తర్వాత ఆ కారును జాబుల్ ప్రావిన్స్‌లో పాతిపెట్టారు. తాజాగా, దాన్ని తవ్వి తీశారు. ఆ ఫొటోలో సోషల్ మీడియాలోకి వచ్చాయి.  

న్యూఢిల్లీ: అమెరికా పై 9/11 దాడుల తర్వాత అల్ ఖైదా అప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన తాలిబాన్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను తమకు అప్పగించాలని తాలిబాన్లను అడగ్గా.. ఆ దాడులు చేసింది ఒసామా బిన్ లాడెన్ అని నిరూపించే ఆధారాలేంటి అని తాలిబాన్లు వాదించారు. ఒసామా బిన్ లాడెన్‌ను వారికి అప్పగించడానికి తాలిబాన్లు అంగీకరించలేదు. ఆ కారణంగా అమెరికా అప్పటి తాలిబాన్లపై దాడులకు దిగింది. అమెరికా చేస్తున్న దాడుల నుంచి తప్పించుకుని తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ ప్రాణాలు రక్షించుకునేవాడు. అలా చివరకు కాందహార్ నుంచి పారిపోవడానికకి ముల్లా ఒమర్ ఓ టయోటా కారును వాడాడు. టయోటా కొరోల్లాలోనే ఆయన పారిపోయి తలదాచుకున్నాడు. 2013లో మరణించాడు. అయితే, ఆయన మరణాన్ని తాలిబాన్ల కొన్ని ఏళ్ల పాటు బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు.

కానీ, ఆయన స్మృతిగా ఆ టయోటా కొరోల్లా కారును జాబుల్ ప్రావిన్స్‌లో తవ్వి పాతిపెట్టాలని అబ్దుల్ జబ్బార్ ఓమరీ ఆదేశించాడు. ఆయన ఆదేశాల మేరకు ఆ కారును అక్కడే పాతి పెట్టారు. అనంతరం ఆ కారును పట్టించుకోలేదు. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌ను తమ అధీనంలోకి తీసుకుంది. ఎన్నికల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తాజాగా, అమెరికా సైన్యం నిష్క్రమించింది. గతేడాది ఆగస్టున తాలిబాన్లు మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది.

ఇప్పుడు అదే అబ్దుల్ జబ్బారి ఓమరి ఆ కారును తవ్వి తీయాల్సిందిగా ఆదేశించాడు. తాలిబాన్లు జాబుల్ ప్రావిన్స్‌లో పాతిపెట్టిన తమ సంస్థ వ్యవస్థాపకుడు ఒమర్ అబ్దుల్లా వినియోగించిన టయోటా కొరొల్లా కారును తవ్వి తీశారు. 

ఈ కారు ఇప్పటికీ మంచి కండీషన్‌లో ఉన్నదని, ముందు భాగం కొంత డ్యామేజీ అయిందని జాబుల్ ప్రావిన్స్ ఇన్ఫర్మేషన్, కల్చర్ డైరెక్టర్ రహమతుల్లా హమ్మద్ అన్నారు. ముల్లా ఒమర్‌ స్మారకంగా 2001లో ఆ వాహనాన్ని దాచి పెట్టారని చెప్పారు. ఈ కారును దేశ రాజధానిలోని మ్యూజియంలో భద్రపరుస్తామని వివరించారు. గ్రేట్ హిస్టారికల్ మాన్యుమెంట్‌గా దీన్ని భద్రపరుస్తామని అన్నారు. ఆ కారును తవ్వి తీస్తున్న దృశ్యాలను తాలిబాన్ మీడియా అఫీషియల్స్ పబ్లిష్ చేశారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !