మహిళలు కొంచెం తక్కువ తాగితే లైంగికదాడులకు గురికారు: ఇటలీ ప్రధాని భాగస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Aug 31, 2023, 04:28 PM IST
మహిళలు కొంచెం తక్కువ తాగితే లైంగికదాడులకు గురికారు: ఇటలీ ప్రధాని భాగస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

మహిళలు తాగడం కొంచెం తగ్గిస్తే లైంగిక దాడులను తగ్గించుకోవచ్చని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ పార్ట్‌నర్ ఆండ్రియా గాంబ్రునో కామెంట్ చేశారు. మహిళలు మద్యం తాగి స్పృహ కోల్పోయి ఈ ఉపద్రవాన్ని కొని తెచ్చుకుంటున్నారని అన్నారు.  

న్యూఢిల్లీ: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పార్ట్‌నర్ ఆండ్రియో గాంబ్రునో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైట్ వింగ్ వైపు మొగ్గు చూపే చానెల్ రీటె 4లో ఆయన మాట్లాడుతూ.. మహిళలు కొంచెం తక్కువ తాగితే లైంగిక దాడులు బారిన పడకుండా బయటపడొచ్చని అన్నారు. నేపుల్స్, పలెర్మో వంటి పట్టణాల్లో గ్యాంగ్ రేప్ కేసులు భారీగా పెరుగుతున్న సందర్భంలో ఆండ్రియా గాంబ్రునో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు డ్యాన్స్ చేస్తూ ఫుల్‌గా తాగడానికి నిర్ణయించుకున్నట్టైయితే... కానీ, ఒక వేళ మీరు తాగడమే నిరాకరించి ఉంటే.. తద్వార స్పృహ కోల్పోయే అవకాశం ఉండదని తెలిపారు. తద్వార మీరు గుంట నక్కలను త్వరగానే పసిగట్టగలుగుతారని, ఫలితంగా మీరు రేప్ బారిన పడే అవకాశాలు చాల వరకు తగ్గిపోతాయి’ అని వివరించారు.

రేప్‌నకు గురి కావొద్దంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పృహ కోల్పోవద్దని, మీ నిబద్ధతను, మీ పట్టుదలను మీరు కోల్పోకూడదని రైట్ వింగ్ పేపర్ లిబెరో ఎడిటర్ పీట్రో సెనాల్డి వ్యాఖ్యలను గాంబ్రునో అంగీకరించారు. వీరిద్దరూ రేపిస్టులను గుంట నక్కలుగా పేర్కొన్నారు.

అయితే, వారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గాంబ్రునో బాధితులపైనే దాడి చేస్తున్నారని వీరు విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా.. గాంబ్రునో వ్యాఖ్యలకు ఇటలీ పీఎం జార్జియా మెలోని దూరంగా ఉండాలని నెటిజన్లు సూచించారు.

Also Read: జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది దుర్మరణం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం..

ఈ కామెంట్లను ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ పార్టీ ఖండించింది. గాంబ్రునో వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటని పేర్కొంది. వారు తిరోగమన సంస్కృతి, పురుషాధిక్య సమాజానికి ప్రతినిధులు అని తెలిపింది.

కాగా, ఆండ్రియా గాంబ్రునో తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఒక వేళ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు చెప్పి ఉండేవాడినని అన్నారు. కానీ, తన వ్యాఖ్యలు తప్పు కాదని, రాజకీయ నాయకులు తనకు చెప్పాల్సిన రోజు ఇది వరకు రాలేదని తెలిపారు. ఇకపైనా రాబోదని అన్నారు.

‘రేప్ అనేది ఆమోదయోగ్యం కాని చర్య. కానీ, నేను ప్రజలకు మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోరాదని స్వేచ్ఛ తీసుకుని సూచించాను. నేను వారికి అప్రమత్తంగా ఉండాలని సూచించాన. అఘాయిత్యాలకు పాల్పడే  మూర్ఖులు ఎప్పుడూ ఉంటారు. అంతేకానీ, తాగి ఉన్న మహిళలను ఎవరైనా లైంగికదాడి చేయవచ్చని నేను పిలుపు ఇవ్వలేదు’ అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !