భారతీయులకు ఇజ్రాయిల్ ప్రధాని కుమారుడి క్షమాపణలు

By telugu news teamFirst Published Jul 30, 2020, 8:25 AM IST
Highlights

తన తండ్రి అవినీతి కేసుల్లో ప్రాసిక్యూటర్‌గా ఉన్న లియత్ బెన్ ఆరి ముఖం మార్ఫ్ చేసి ఉంది. కాగా.. యైర్ పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. పెద్ద కుమారు యైర్ భారతీయులకు క్షమాపణలు చెప్పాడు. భారతీయుల ఇష్ట ఆరాధ్య దైవమైన దుర్గామాతను కించరుస్తూ ఇటీవల యైర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.  ఆయన పెట్టిన ఓ పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తప్పు తెలుసుకుని, ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. 

పూర్తి  వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై న్యాయస్థానాల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెతన్యాహు కుమారుడు యైర్.. ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో హిందువుల ఇష్టదైవం అయిన దుర్గాదేవి ముఖం స్థానంలో.. తన తండ్రి అవినీతి కేసుల్లో ప్రాసిక్యూటర్‌గా ఉన్న లియత్ బెన్ ఆరి ముఖం మార్ఫ్ చేసి ఉంది. కాగా.. యైర్ పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

 దీంతో తప్పు తెలుసుకున్న యైర్.. ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అంతేకాకుండా భారతీయులను క్షమపణ కోరుతూ.. ట్విట్టర్‌లో మరో పోస్ట్ పెట్టాడు. అందులో ‘నేను ఇజ్రాయెల్ రాజకీయ నేతను విమర్శిస్తూ ఫొటోను పోస్ట్ చేశాను. ఆ ఫొటోలో భారతీయుల ఇష్టదైవం ఉందన్న విషయం నాకు తెలియదు. కొందరు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాను. ఈ తప్పు నేను కావాలని చేసింది కాదు. నన్ను క్షమించండి’ అంటూ పేర్కొన్నాడు. 
 

click me!