ఉత్తరకొరియాలో కరోనా తొలికేసు నమోదు: కేసాంగ్‌లో లాక్‌డౌన్ విధింపు

By narsimha lodeFirst Published Jul 26, 2020, 10:24 AM IST
Highlights

ఉత్తరకొరియాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం.


ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కేసులు మాత్రం ఉత్తరకొరియాలో నమోదు కాలేదు. దక్షిణ కొరియాలో పలు కేసులు నమోదయ్యాయి.కానీ పక్కనే ఉన్న ఉత్తరకొరియాలో మాత్రం  నమోదు కాలేదు.

ఈ నెల 25వ తేదీన ఉత్తరకొరియాలో తొలి కరోనా కేసు నమోదైంది. దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేసాంగ్ నగరంలో లాక్ డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్ అధికారులను ఆదేశించారు. వైరస్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడ పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. 

కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారంతా కఠినమైన క్వారంటైన్ లో ఉండాలని ఆ దేశం ఆదేశించింది. కఠినమైన క్యారంటైన్ నిబంధనలు ఆ దేశంలో అమలు చేయనున్నారు. 

దేశంలో 976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇందులో ఏ ఒక్కరికి కూడ కరోనా సోకలేదని ఆ దేశం ప్రకటించింది. అయితే కోవిడ్ లక్షణాలు  ఉన్న 25,551 మందిని క్వారంటైన్ చేశారు  అధికారులు. అంతేకాదు వీరిలో ప్రస్తుతం 255 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. 

 


 

click me!