గాజాలోని హాస్పిటల్స్ మిలిటెంట్ హబ్స్ గా పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇక్కడి అమాయకులను హమాస్ మానవకవచంగా వాడుతోందని తెలిపింది.
గాజా : శుక్రవారం ఇజ్రాయెల్ మూడు గాజా ఆసుపత్రులు, ఒక పాఠశాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 22 మంది మరణించారు. మరొక ఆసుపత్రి మీద భూదాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఎన్‌క్లేవ్ నడిబొడ్డున దాడి చేశాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా ప్రాంగణంలో తెల్లవారుజామున క్షిపణులు ప్రయోగించారు. ఇండోనేషియా ఆసుపత్రిని ధ్వంసం చేసి, నాసర్ రాంటిస్సీ పీడియాట్రిక్ క్యాన్సర్ ఆసుపత్రికి నిప్పంటించారని అధికారులు తెలిపారు.
ఈ ఆసుపత్రులు ఉత్తర గాజాలో ఉన్నాయి. ఇక్కడ గత నెలలో దాడి చేసిన హమాస్ తీవ్రవాదులకు కేంద్రీకృతంగా ఉందని.. ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ ఆస్పత్రులు రోగులు, వైద్యులతో నిండి ఉన్నాయి. హమాస్ వారిని మానవ కవచాలుగా ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ వాదనను ఆ గ్రూప్ ఖండించింది. ఇజ్రాయెల్ ట్యాంకులు నాసర్ రాంటిస్సీ, పిల్లల, కంటి ఆసుపత్రులతో పాటు అల్-ఖుడ్స్ ఆసుపత్రి చుట్టూ స్థానాలను ఆక్రమించుకున్నాయని వైద్య సిబ్బంది ముందుగా చెప్పి, అలర్ట్ చేశారు.
undefined
అంగస్తంభనల కోసం వాటికి షాక్ థెరపీ.. 45 ఏళ్ల వయసులో ఆ మిలియనీర్ చేసే ప్రయోగాలివే
"ఇజ్రాయెల్ ఇప్పుడు గాజా సిటీ ఆసుపత్రులపై యుద్ధాన్ని ప్రారంభిస్తోంది" అని శుక్రవారం తెల్లవారుజామున క్షిపణుల దాడికి గురైన షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మహ్మద్ అబు సెల్మెయా చెప్పారు. షిఫా ఆసుపత్రి భవనాలపై ఇజ్రాయెల్ ఐదుసార్లు బాంబు దాడి చేసిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-కిద్రా తెలిపారు. "తెల్లవారుజామున జరిగిన దాడిలో ఒక పాలస్తీనియన్ మరణించాడు. అనేకమంది గాయపడ్డారు" అని ఫోన్ లో తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోల్లో భయాందోళనల దృశ్యాలు, రక్తంతో తడిసిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారు. గాజా నగరంలోని అల్-బురాక్ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 20 మంది మరణించారని, అక్కడ ఇళ్లు ధ్వంసమై ప్రజలు ఆశ్రయం పొందారని సెల్మెయా చెప్పారు. ఇజ్రాయెల్ దళాలు అల్-ఖుద్స్ ఆసుపత్రిపై కాల్పులు జరుపుతున్నాయని, హింసాత్మక ఘర్షణలు జరిగాయని, ఒక వ్యక్తి మరణించగా, 28 మంది గాయపడ్డారని, వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని పాలస్తీనా రెడ్‌క్రాస్ తెలిపింది. ఈ నివేదికలపై ఇజ్రాయెల్ ఇంకా వ్యాఖ్యానించలేదు.
పౌరులపై తాము దాడులను లక్ష్యంగా పెట్టుకోలేదని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి ఐలాన్ లెవీ మాట్లాడుతూ హమాస్ హెచ్‌క్యూ షిఫా ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఉందని, దీని అర్థం ఆసుపత్రి దాని రక్షిత హోదాను కోల్పోయి చట్టబద్ధమైన లక్ష్యంగా మారుతుందని అన్నారు.
ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లో 15,000 "ఉగ్రవాద లక్ష్యాలను" గుర్తించినట్లు, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 6,000 ఆయుధాలను గుర్తించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఇంకా రాకెట్లు, యు షెల్స్‌తో కాల్పులు జరుపుతున్నామని, గాజాలో సైనికులతో పోరాడుతున్నామని హమాస్ సాయుధ విభాగం శుక్రవారం తెలిపింది. హమాస్ రాకెట్ కాల్పుల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు టెల్ అవీవ్, పరిసర ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. టెల్ అవీవ్‌లో ఇద్దరు మహిళలు ష్రాప్‌నెల్ గాయాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.