45 ఏళ్ల అమెరికన్ మిలియనర్ తాను లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు అంగస్తంభనల సమస్యను ఎదుర్కోవద్దని అనుకున్నాడు. 18 ఏళ్ల వయసు యువకుల్లో ఉండే స్థాయిలో అంగస్తంభనలు ఉండాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఇందుకోసం షాక్ వేవ్ థెరపీని స్టార్ట్ చేశాడు. ఇందులో జననాంగాలకు షాక్ థెరపీ ఇస్తారు.
న్యూఢిల్లీ: ఆ మిలియనీర్ వయసు 45 ఏళ్లు. కానీ, ఆయన కోరుకునేది విడ్డూరంగా ఉన్నది. 18 ఏళ్ల వయసులో యువకుల్లో అంగస్తంభనలు ఎలా ఉంటాయో.. అలాగే ఈ వయసులోనూ ఉండాలని ఆరాటపడుతున్నాడు. రాత్రిపూట మూడున్నర గంటలపాటు అంగస్తంభనలు ఉండేలా బాడీని మార్చుకోవడమే తన లక్ష్యం అని బాహాటంగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. తనలో ఈ మార్పు రావడానికి ఆయన కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన ప్రైవేట్ పార్టులకు షాక్ థెరపీ ఇస్తున్నాడు.
అమెరికాకు చెందిన 45 ఏళ్ల మిలియనీర్ బ్రియాన్ జాన్సన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలనూ తాను అనుభవిస్తున్నానని వివరించాడు. డైరీ ఆఫ్ ఏ సీఈవో పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను వెల్లడించాడు. ఈ బయో హ్యాకర్ తనను తాను యువకుడిగా ఉంచుకోవడానికి ప్రతి యేటా అనేక రకాల ట్రీట్‌మెంట్ల కోసం 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు తాను కాలానికి సవాల్ విసురుతున్నానని చెప్పాడు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ను తాను విజయవంతంగా అడ్డుకోగలుగుతున్నాని వివరించాడు. షాక్‌వేవ్ థెరపీ ద్వారా తాను ఇది సాధ్యం చేస్తున్నట్టు తెలిపాడు.
ఈ షాక్ వేవ్ థెరపీ గురించి ఆయన ఈ విషయాలు చెప్పాడు. సింపుల్ ఒక ఇనుప కడ్డీని నీకు దగ్గరగా పెట్టుకుని కుర్చీలో కూర్చోవాలి. టెక్నీషియన్ అకోస్టిక్ టెక్నాలజీతో మీ జననాంగానికి షాక్ ఇస్తాడు. దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంగస్తంభనల సమస్యల నివారణకూ దీన్ని ఉపయోగిస్తారు. ఈ చికిత్స తీసుకుంటున్నప్పటి నుంచి తాను తన లైంగిక చర్యల్లో అంగస్తంభనల సమస్యను ఎదుర్కోవడం లేదని చెప్పాడు.
Also Read: తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు షాక్.. వారంతా ఇండిపెండెంట్లుగానేనా?.. బీజేపీలో ఆగ్రహం!
షాక్ అంటే అది ఎలక్ట్రికల్ కాదని, అది చిన్న చిన్న గాయాలను చేస్తే మజిల్స్ పునర్నిర్మించుకుంటుందని జాన్సన్ వివరించాడు. ఈ ట్రీట్‌మెంట్ చాలా బాధతో కూడుకుని ఉంటుంది. ‘కానీ, ఈ ఫలితాలు చూసి నేను షాక్ అయ్యాను. ఈ ట్రీట్‌మెంట్ ప్రారంభించి రెండు నెలలు అవుతున్నది. ఇప్పుడు నా పెనిస్ 15 ఏళ్ల వయసును మరిచిపోయిందా అన్నట్టు ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్నాను’ అని తెలిపాడు.
జాన్సన్ ఒక ఎంట్రప్రెన్యూవర్, వెంచర్ క్యాపిటలిస్ట్, రచయిత కూడా. బ్రెయిన్ యాక్టివిటీని మానిటర్, రికార్డ్ చేసే కంపెనీ కెర్నెల్‌కు సీఈవో. ఆయన గతంలో యువకుడిగా మారడానికి ప్రయత్నాలు చేశాడు. తన 17 ఏళ్ల కొడుకు రక్తం ప్లాస్మాను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత తన చర్మం 28 ఏళ్ల యువకుడి చర్మంలా, తన ఊపిరితిత్తులు 18 ఏళ్ల వయసులో ఉండేవారిలా ఉన్నాయని చెప్పాడు.