ఇజ్రాయెల్ కంపెనీ దుస్సాహాసం: మద్యం బాటిళ్లపై గాంధీ చిత్రం

Siva Kodati |  
Published : Jun 30, 2019, 03:58 PM IST
ఇజ్రాయెల్ కంపెనీ దుస్సాహాసం: మద్యం బాటిళ్లపై గాంధీ చిత్రం

సారాంశం

ఇజ్రాయిల్‌కు చెందిన ఓ లిక్కర్ కంపెనీ జాతిపిత మహాత్మాగాంధీని అవమానించింది. మద్యం సీసాలపై ఏకంగా గాంధీ బొమ్మని ముద్రించి విక్రయాలకు దిగడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇజ్రాయిల్‌కు చెందిన ఓ లిక్కర్ కంపెనీ జాతిపిత మహాత్మాగాంధీని అవమానించింది. మద్యం సీసాలపై ఏకంగా గాంధీ బొమ్మని ముద్రించి విక్రయాలకు దిగడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మకా బ్రూవరీ అనే మద్యం కంపెనీ.. బీరు సీసాలపై ప్రముఖుల బొమ్మలను ముద్రించి అమ్మకాలు చేస్తోంది. దీనిలో భాగంగా మహాత్మా గాంధీ చిత్రాన్ని కూడా ముద్రించారని.. కేరళలోని పాలెం కేంద్రంగా పనిచేస్తోన్న మహాత్మా గాంధీ జాతీయ సంస్థ ఛైర్మన్ ఎబీ జే జోస్ దృష్టికి వచ్చింది.

దీంతో ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందిగా జోస్.. భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు లేఖ రాశారు. కూలింగ్ గ్లాస్, టీషర్ట్ దానిపై ఓవర్‌కోట్ ధరించినట్లు ఉన్న గాంధీ చిత్రాన్ని అమిత్ శిమోనీ అనే వ్యక్తి రూపొందించినట్లు తెలిపారు.

ఈ చిత్రాల్ని హిప్‌స్టోరీఆర్ట్. కామ్ అనే వెబ్‌సైట్‌లోనూ వివిధ రూపాల్లో విక్రయిస్తున్నట్లు జోస్ లేఖలో పేర్కొన్నారు. వెంటనే మద్యం సీసాలు, వెబ్‌సైట్ల నుంచి ఈ చిత్రాల్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మద్యం, మాంసం వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మహాత్మా గాంధీ చిత్రాన్ని ఇలా వాడటం నిజంగా విచారకరమని జోస్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..