Omicron: డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమా?.. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే..

By team telugu  |  First Published Nov 29, 2021, 12:07 PM IST

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మరి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్.. ఎంత ప్రమాదకరం, వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) ఏం చెబుతుందో ఒకసారి చూస్తే.. 


కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (B.1.1.529) పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన Omicron వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) హెచ్చరికలు కూడా జరీచేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏకంగా అంతర్జాతీయ ప్రయాణికులను దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. అంతేకాకుండా గత వారం రోజుల వ్యవధిలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసినవారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు ఉన్న కోవిడ్ వేరియంట్లలో.. ముఖ్యండా డెల్టా వేరియంట్ (Delta variant) కన్నా ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమైనదనే ప్రచారం కూడా జరగుతుంది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుందని తెస్తోంది. బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్, జర్మనీ, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్‌‌ దేశంలో విస్తరించకుండా భారత ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్.. ఎంత ప్రమాదకరం, వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందో ఒకసారి చూస్తే.. 

Latest Videos

undefined

-ఇదివరకు కరోనా వైరస్ సోకినవారికి కూడా ఒమిక్రాన్ సంక్రమించే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇంతకుముందు కోవిడ్‌ బారిన పడినవారికి ఈ వేరియంట్ మరింత సులువుగా సంక్రమించవచ్చు. ఈ వేరియంట్‌ను డేంజరస్ కేటగిరీలో చేర్చింది.

Also read: ఒమిక్రాన్ వేరియంట్ కలకలం... కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన హైలెవల్ భేటీ

-డెల్టా, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తుందా..? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఆర్టీ పీసీఆర్ (RT-PCR) పరీక్షలు ఈ వేరియంట్‌ను గుర్తించగలవు. 

-ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎంత వరకు ఎదుర్కొంటాయనే అంశంపై పరిశోధనలు చేయడానికి మరికొన్ని వారాల సమయం పడుతుంది. ఈ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి WHO సాంకేతిక భాగస్వాములతో కలిసి పని చేస్తోంది.

- ఒమిక్రాన్‌ వేరియంట్ ఆరోగ్యంపై ఎలాంటి తీవ్రతను చూపుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఓమిక్రాన్ యొక్క లక్షణాలు ఇతర రూపాంతరాల నుండి భిన్నంగా ఉన్నాయని సూచించడానికి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. 

ALso Read:Omicron : ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.. నెగిటివ్ వస్తేనే ఇంటికి, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

-ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడుతున్న వారి సంఖ్య దక్షిణాఫ్రికాలో పెరుగుతుందని గణంకాలు సూచిస్తున్నాయి. Omicron వేరియంట్ తీవ్రత స్థాయిని అర్థం చేసుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది.

click me!