భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకు జ్ఞాపక శక్తి కోల్పోయాడు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

Published : May 28, 2022, 05:25 PM IST
భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకు జ్ఞాపక శక్తి కోల్పోయాడు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

సారాంశం

ఐర్లాండ్‌కు చెందిన ఓ 66 ఏళ్ల వ్యక్తి తన భార్యతో సంభోగించిన పది నిమిషాల తర్వాత జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. ఆయన క్రితం రోజు జరిగిన విషయాలనూ పూర్తిగా మరిచిపోయాడు. అదే రోజు ఉదయం జరిగిన ముచ్చట్లనూ మరిచిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి తిరిగి తన జ్ఞాపక శక్తిని పొందాడు. ఈ ఘటనపై ఐరిషష్ మెడికల్ జర్నల్ ఓ రీసెర్చ్ ఆర్టికల్ ప్రచురించింది.

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఉన్నట్టుండి తన జ్ఞాపక శక్తి కోల్పోయాడు. ఐర్లాండ్ దేశానికి చెందిన 66 ఏళ్ల వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న తర్వాత పది నిమిషాలకు తన మెమోరీ లాస్ అయ్యాడు. భార్యతో శారీరకంగా కలిసిన తర్వాత ఆయన తన ఫోన్ చూసుకున్నాడు. డేట్ చూసి షాక్ అయ్యాడు. అయ్యో ఒక రోజు ముందే తన మ్యారేజ్ డేట్ గడిచిపోయిందని బాధపడ్డాడు. తన మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదని తెగ ఫీల్ అయ్యాడు. నిజానికి, ఆయన అంతకు ముందటి రోజు వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నిన్న రోజు గురించి, ఉదయంలో జరిగిన విషయాల గురించి మళ్లీ మళ్లీ అడగడం మొదలు పెట్టాడు. ఆయన తన గతాన్ని మరిచిపోయినట్టు గుర్తించాడు.

ఈ ఘటన గురించి ఐరిష్ మెడికల్ జర్నల్ పరిశోధన చేసి ఓ పరిశోధనాత్మక కథనాన్ని ఈ నెలలోనే ప్రచురించింది. ఈ కథనంలో వైద్య నిపుణులు ఈ ప్రమాదాన్ని ట్రాన్సియెంట్ గ్లోబల్ ఆమ్నేసియా (టీజీఏ) అని తెలిపారు. తన భార్యతో రతి జరిపిన తర్వాత పది నిమిషాలకే ఆ ఐరిష్ వ్యక్తి జ్ఞాపక శక్తిని కోల్పోయాడని, తన భార్య, కూతురిని పదే పదే చిన్న చిన్న విషయాల గురించి ఆరా తీశాడని ఆ కథనం పేర్కొంది.

ఇలాంటి స్థితి ఎక్కువగా 50 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు మధ్య గలవారిలో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు వెల్లడించారు. ఈ స్థితిలో సదరు మనిషి రీసెంట్‌గా జరిగిన విషయాలు అన్నింటిని మరిచిపోతుంటాడని వివరించారు. కొంత మందికి ఏడాది క్రితం జరిగిన విషయాలనూ మరిచిపోతుంటారని తెలిపారు. అయితే, ఈ టీజీఏతో అఫెక్ట్ అయినవారు మరిచిపోయిన విషయాలను కొంత కాలం తర్వాత అంటే తక్కువ వ్యవధిలోనే మళ్లీ తిరిగి పొందుతారని వివరించారు. ఈ కేసులో దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిని మాత్రం కోల్పోరని తెలిపారు. అంతేకాదు, సినిమాల్లో చూపినట్టుగా ఈ వ్యక్తులు తమ ఐడెంటిటీని మరిచిపోరని పేర్కొన్నారు. అంటే.. వారి పేరు, వయసు, ఇతర ప్రాథమిక విషయాలను గుర్తుంచుకుంటారని వివరించారు.

ఈ కేసులో వ్యక్తి ఇప్పుడే కాదు.. 2015లోనూ ఇలాంటి స్థితే ఎదుర్కొన్నట్టు వైద్యులు తెలిపారు. అప్పుడు కూడా సంభోగంలో పాల్గొన్న తర్వాతే మెమోరీ లాస్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత వెంటనే మళ్లీ అన్నింటిని జ్ఞప్తికి తెచ్చుకోగలిగాడు.

తాజాగా, ఆయన మళ్లీ మెమోరీ లాస్ అయినట్టు రియలైజ్ అయ్యాడు. దీంతో ఆయన లోకల్ ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాాడు. అయితే, అక్కడ తన న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్‌లో పూర్తిగా సాధారణం అని వచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తన మెమోరీ మళ్లీ వచ్చింది. 

టీజీఏకు లోనయ్యే పది శాతం మంది మళ్లీ ఆ సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్పారు. ఫిజికల్ యాక్టివిటీ, చల్లని లేదా వేడైన నీటిలో మునిగినప్పుడు, ఎమోషనల్లీ స్ట్రెస్‌గా ఉన్నప్పుడు, బాధ, సంభోగం వంటి చర్యలు చేసిన తర్వాత టీజీఏకు లోనవుతూ ఉంటారని పరిశోధనాత్మక కథనం తెలిపింది.

టీజీఏ కారణంగా మెమోరీ లాస్ కాదని, కొద్ది సేపు జ్ఞాపక శక్తిని కోల్పోతామని, మళ్లీ గతాన్ని గుర్తు చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ సిచువేషన్ అనుభవిస్తున్నవారికి, ఆప్తులకు బాధాకరంగా అనిపిస్తుంటుంది. కానీ, వైద్య నిపుణులు దీన్ని సీరియస్‌గా తీసుకోరు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !