హెర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత: బ్రిటిష్‌ ట్యాంకర్‌ను అడ్డగించిన ఇరాన్‌

By Siva KodatiFirst Published Jul 11, 2019, 8:12 PM IST
Highlights

గల్ఫ్‌ సమీపంలోని హెర్ముజ్ జలసంధిలో బ్రిటీష్ చమరు ట్యాంకర్‌ను ఇరాన్‌ అడ్డగించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. 

గల్ఫ్‌ సమీపంలోని హెర్ముజ్ జలసంధిలో బ్రిటీష్ చమరు ట్యాంకర్‌ను ఇరాన్‌ అడ్డగించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. గల్ఫ్ నుంచి హెర్ముజ్ జలసంధి ద్వారా వెళుతున్న హెచ్ఎమ్ఎస్ మన్ట్‌రోజ్‌‌ను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవొల్యుషనరీ గార్డ్స్ మూడు నౌకలలో వచ్చి అడ్డగించారు.

అయితే బ్రిటీష్ సిబ్బంది పలు హెచ్చరికలు చేయడంతో.. ఆ నౌకలు అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రదేశం వివాదాస్పద జలాలు ఉండే అము ముసాకి సమీపంలో ఉంది.

ఆంక్షలను ఉల్లంఘిస్తూ సిరియాకు క్రూడాయిల్ సరఫరా చేస్తున్న ఆరోపణలపై ఇరాన్‌కు చెందిన గ్రేస్-1 సూపర్ ట్యాంకర్‌ను బ్రిటన్ స్వాధీనం చేసుకోవడంతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమైంది.

ఇందుకు ప్రతీకారంగా తాము యూకేకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది.. ఇలాంటి ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ సేనలు అడ్డుకోవడం ఈ ప్రాంతంలో అలజడిని మరింత పెంచింది. 

click me!