‘‘డ్రెస్ కవర్ చేసుకుంటేనే.. విమానం ఎక్కుతారు’’

By telugu teamFirst Published Jul 10, 2019, 4:44 PM IST
Highlights

విమానంలో ఓ వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. తాను వేసుకున్న డ్రస్ బాలేదంటూ తన పట్ల విమాన సిబ్బంది అవమాన కరంగా మాట్లాడారాని ఆమె ఆరోపించారు.

విమానంలో ఓ వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. తాను వేసుకున్న డ్రస్ బాలేదంటూ తన పట్ల విమాన సిబ్బంది అవమాన కరంగా మాట్లాడారాని ఆమె ఆరోపించారు. అయితే... తాను నల్లజాతీయురాలి కావడం వల్లే తనను అలా ట్రీట్ చేశారని ఆమె చెప్పడం గమనార్హం. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే...టిషా రోవ్ అనే వైద్యురాలు అమెరికాలోని మియామీలో నివశిస్తున్నారు. కాగా తన బంధువులను చూసొచ్చేందుకు కొడుకుతో సహా కొద్దిరోజుల క్రితం జమైకా వెళ్లారు. అనంతరం..మియామీకి తిరుగు ప్రయాణమయ్యేందుకు జూన్ 30న కింగ్‌స్టన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

అయితే.. విమానం ఎక్కుతున్న ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. డ్రస్ సరిగా లేదని.. పైన ఏదైనా లెదర్ జాకెట్ వేసుకోవాలని సూచించారు. తన దగ్గర లెదర జాకెట్ లేదని చెప్పడంతో.. ఒక దుప్పటి ఇచ్చి కప్పుకోవాలని సూచించారు. తాను జుమైకా వాతావరణ పరిస్థితులను బట్టి డ్రస్ వేసుకున్నానని చెప్పినా వినకపోవడంతో.. ఆమె వారు ఇచ్చిన దుప్పటి పైన కప్పుకొని ప్రయాణించారు.

విమానం గమ్యస్థానం చేరుకున్న తర్వాత తాను విమానం దిగుతుండగా... తనకన్నా పొట్టి దుస్తులు వేసుకున్న మహిళ ఆమెకు తారసపడటంతో టిషా షాకయ్యారు. తాను కేవలం నల్లజాతీయురాలు అవ్వడం వల్లనే ఇలా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా..ఈ ఘటనపై స్పందించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ టిషాకు క్షమాపణలు చెప్పింది. "అన్ని వర్గాల ప్రజలకూ సేవలందించటాన్ని మేమే గర్వాంగా భావిస్తాం. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందకు అన్ని చర్యలూ తీసుకుంటాం" అని సంస్థ ప్రతినిథి తెలిపారు. ఈ ఘటన వైరల్ అవడంతో ప్రస్తుతం నెటిజన్లు సదరు విమానయాన సంస్థ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

click me!